వేధింపులకు మరో యువతి బలి

వేధింపులకు మరో యువతి బలి

తూర్పుగోదావరి జిల్లాలో వేధింపులకు మరో యువతి బలైంది. మామిడికుదురు మండలం గోగన్నమఠం గ్రామానికి చెందిన మధుశ్రీ వేధింపులతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన రాజేష్‌ అనే యువకుడు గత కొన్ని రోజులుగా మధుశ్రీ వెంట పడుతూ వేధిస్తున్నాడు. కాలేజీకి వెళ్లే సమయంలో.. ఇంటికి తిరిగొచ్చే సమయంలో వేధింపులకు పాల్పడేవాడు. దీంతో మనస్తాపం చెందిన మధుశ్రీ ఇంటి ఎదురుగా ఉన్న చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషయం తెలిసి గతంలో రాజేష్‌ను పెద్దలు మందలించారు. అయినా పద్దతి మార్చుకోకుండా మధుశ్రీని టార్చర్‌ పెట్టాడని మృతురాలి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రాజేష్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు.

Tags

Next Story