తూర్పుగోదావరి జిల్లాలో వింత ఘటన

తూర్పుగోదావరి జిల్లాలో వింత ఘటన

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం చిడిగలో వింత చోటు చేసుకుంది. గ్రామంలో ఉన్న వేప చెట్టుకు కళ్ళు నోరు ఆకారం ఏర్పడ్డాయి. దీంతో.. స్థానికులు వేప చెట్టును దేవతగా పూజిస్తున్నారు. కలలో అమ్మవారు కనిపించి తాను వేపచెట్టు రూపంలో వెలిశాను అని చెప్పినట్లు స్థానిక మహిళలు చెప్పడంతో భక్తులు భారీగా అక్కడకు చేరుకుంటున్నారు. శుక్రవారం.. తొలి ఏకాదశి కావడంతో భక్తులు భారీగా చేరుకుని వేప చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో.. రాత్రికి రాత్రే ఆ వేప చెట్టు పుణ్యక్షేత్రంగా మారిపోయింది. గ్రామంలో ఓ కుటుంబం.. వేపచెట్టును తమ కుల దేవతగా భావించి గత ఉగాది నుంచి ఆ చెట్టుకు పూజలు చేస్తున్నారు. అమ్మవారిని పూజిస్తే మంచి జరుగుతుందని నమ్మకం ఉన్న నేపధ్యంలోనే.. అందరం కలిసి ఆమెను కొలుస్తున్నామని అంటున్నారు. అయితే .. జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు మాత్రం వేప చెట్టుకు పూజలు నిర్వహించడాన్ని ఖండిస్తున్నారు. వేప చెట్టు పెరుగుదలో వచ్చిన మార్పు గురించి తెలియని వ్యక్తులు దానిని దేవతగా కొలుస్తున్నారు అని అంటున్నారు. వేప చెట్టుకు కళ్ళు నోరు ఏర్పడటం పూర్తిగా మూఢనమ్మకమేనని కొట్టిపారేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story