భారత్ ఓటమిని చూసి జాగ్రత్తపడ్డ ఇంగ్లాండ్.. లక్ష్యం 224 పరుగులే ఉన్నా..
వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా కథ ముగిసింది. వన్‌సైడ్‌గా జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్..... 8 వికెట్ల తేడాతో ఆసీస్‌పై గెలిచింది. నాలుగో సారి వరల్డ్ కప్ ఫైనల్‌లో ప్రవేశించింది. లార్డ్ వేదికగా ఆదివారం ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దీంతో ఈ సారి వన్డే ప్రపంచకప్ ఛాంపియన్‌గా కొత్త జట్టు అవతరించనుంది.డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేసి ఫైనల్లో అడుగుపెట్టింది ఇంగ్లండ్. రెండో సెమీస్‌లో భాగంగా... ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయసాధించింది.ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రెండో సెమీఫైనల్ పోరు ఏకపక్షంగా సాగింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 224 పరగుల లక్ష్యాన్ని 35 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది. 224. ఇదేమంత స్కోరే కాకపోయిన .. స్వల్ఫ స్కోరుకే కివీస్ చేతిలో భారత్ చిత్తవడం, ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా వికెట్ల విలాపంతో ఇంగ్లండ్ జాగ్రత్తపడింది. బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఆది నుంచే ఎదురుదాడి చేసింది. వర్షం పడొచ్చన్న అంచనాల నేపథ్యంలో ఓపెనర్లు ధాటిగా ఆడారు. ముఖ్యంగా జేసన్ రాయ్ 20-20 మ్యాచ్ లా చెలరేగాడు. 5 సిక్సర్లు, 9 ఫోర్లతో 85 పరుగులు చేశాడు. బెయిర్‌స్టో నుంచి అతని చక్కటి సహకారం లభించింది. వీరిద్దరూ అవుటయ్యాక జో రూట్, మోర్గాన్ జోడీ మరో వికెట్ పడకుండా లాంఛనం పూర్తి చేసింది.
అంతకు ముందు టాస్ గెలిచిన బ్యాంటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా.... ఇంగ్లండ్ బౌలర్ల దాటికి 49 ఓవర్లలో 223 పరుగులకే కుప్పకూలింది. క్రిస్ వోక్స్, అదిల్ రషీద్, అర్చర్‌లు చెలరేగడంతో ఆసీస్ విలవిలాడింది. స్మిత్‌తోపాటు అలెక్స్ కారీ, చివర్ల మ్యాక్స్ వెల్‌లు ఓ మోస్తరుగా రాణించడం వల్ల .. ఇంగ్లండ్ ముందు ఆసీస్ 223 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది... ఆసీస్ పతనాన్ని శాసించిన క్రిస్ వోక్స్‌కు ప్లేయర్ ఆఫ్‌ద మ్యాచ్ అవార్డు లభించింది. ఆదివారం జరిగే ఫైనల్‌లో ఇంగ్లండ్ న్యూజిలాండ్ జట్టును ఢీకొంటుంది. మొత్తం మీద 1996 తర్వాత తొలిసారి ఓ కొత్త జట్టు వరల్డ్‌కప్‌ను అందుకోబోతోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com