ప్లీజ్ సార్.. ఇటువైపు రాకండి!!.. వీడియో

మీకు లాగా మాకు ఇల్లు లేదండి.. ఎండకి ఎండుతూ.. వానకి తడుస్తూ ఇలానే మేం పెట్టిన గుడ్లను కాపాడు కుంటూ వాటిని పొదుగుతాం. మా పిల్లలకు రెక్కలు వచ్చి ఎగిరిపోయేంతవరకు మా పొత్తిళ్లలోనే పొదువుకుంటాం. ఇప్పటి వరకు కాపాడుతూ వచ్చిన గుడ్లని మీ ట్రాక్టర్ కింద నలిపిస్తానంటే నేనెలా ఊరుకుంటాను. నా ప్రాణాలు అడ్డుగా వేసైనా సరే ఇంకా ఈ లోకం చూడని నా బిడ్డలను కాపాడుకుంటాను. దయ చేసి కనికరించండి.. ఇటు రాకండి.. ఇదంతా ఆ చిన్ని పక్షి తన గుడ్లను కాపాడుకోవడానికి ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నం. చైనాలోని ఎలాంకాబ ప్రాంతంలోని పొలంలో ఓ పక్షి గుడ్లు పెట్టి వాటిని జాగ్రత్తగా చూసుకుంటోంది. ఎవరైనా వస్తారేమో.. గుడ్లను ఏమైనా చేస్తారేమో అని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఇంతలో అటుగా ఓ ట్రాక్టర్ రావడాన్ని చూసింది ఆ చిన్ని పక్షి. అంత తన శక్తి మేరకు రెక్కల్ని చాచి.. అచ్చంగా మనుషుల్లానే ఇటువైపుకి రాకండి అని రిక్వెస్ట్ చేస్తున్నట్లు ఉంది. ఈ అపురూప దృశ్యం ట్రాక్టర్ నడిపే వ్యక్తిని ఆకర్షించడంతో వీడియోలో బంధించి పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్స్ ప్రశంసలు పొందుతోంది.
Mother bird stops moving tractor to protect eggs pic.twitter.com/CWyA28rbvI
— CGTN (@CGTNOfficial) July 10, 2019
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com