ఆంధ్రప్రదేశ్

మంత్రి ఇలాఖాలో వైసీపీ వర్గపోరు

మంత్రి ఇలాఖాలో వైసీపీ వర్గపోరు
X

ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి ఇలాఖా నెల్లూరు జిల్లాలో వైసీపీ వర్గపోరు బయటపడింది. రాజవోలు సొసైటీ అధ్యక్షుడు కాటంరెడ్డి నరసింహారెడ్డి, మండల వైసీపీ అధ్యక్షుడు పందిళ్లపల్లి సుబ్బారెడ్డి మధ్య నెలకొన్న ఘర్షణలు తారాస్థాయికి చేరుకున్నాయి. తహసీల్దార్‌ కార్యాలయం వద్ద మాటామాటా పెరగడంతో రెండు వర్గాల వైసీపీ కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడ్డారు. చివరకు వీరి పంచాయితీ పోలీస్ స్టేషన్‌ వరకు వెళ్లింది. ఇరువర్గాలు ఒకరిపైమరొకరు కేసులు పెట్టుకున్నారు. ఆధిపత్యం ప్రదర్శించేందుకు రెండు వర్గాల నేతలు స్టేషన్‌కు చేరుకోవడంతో అక్కడ కూడా ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Next Story

RELATED STORIES