విజయవాడలో మరోసారి కాల్‌మనీ కలకలం

విజయవాడలో మరోసారి కాల్‌మనీ కలకలం

విజయవాడలో మరోసారి కాల్‌మనీ కలకలం సృష్టించింది. అవసరానికి డబ్బులు ఇచ్చి.. ఆ వెంటనే వేధింపులకు దిగుతున్నారు కొందరు కాల్‌నాగులు.. పెనమలూరులో ఓ వివాహితను తన కోరిక తీర్చాలని అంటూ.. సుబ్రహ్మణ్యం అనే వడ్డీ వ్యాపారీ గత ఏడాది నుంచి వేధిస్తున్నాడు. సుబ్రహ్మణ్యం వేధింపులు తాళలేక పోలీస్‌ కమిషనర్‌ తిరుమలరావును బాధిత మహిళ ఆశ్రయించింది. సీపీ ఉత్తర్వులతో వడ్డీ వ్యాపారి సుబ్రహ్మణ్యంపై పోలీసులు కేసు నమోదుచేశారు. విషయం తెలుసుకున్న వడ్డీ వ్యాపారి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

Tags

Next Story