తాయెత్తులు కట్టించుకునేందుకు వచ్చిన మహిళలను లోబర్చుకొని..

తాయెత్తులు కట్టించుకునేందుకు వచ్చిన మహిళలను లోబర్చుకొని..
X

భార్యను హత్య చేసి దోపిడి దొంగల బీభత్సంగా సృష్టించేందుకు ప్రయత్నించిన భర్తను అరెస్ట్ చేశారు పోలీసులు. 24 గంటల్లోనే నిందితుడ్ని పట్టుకున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన అంజాద్ నగరంలో మత గురువు. అతని దగ్గర తాయెత్తులు కట్టించుకునేందుకు వచ్చిన మహిళలను లోబర్చుకొని అక్రమ సంబంధాలు కొనసాగించాడు. అడ్డుపడిన భార్య తహసీన్ ను శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు గురి చేశాడు. భార్యతో ఏనాటికైనా చిక్కులు తప్పవని భావించిన అంజద్ తహసీన్ ను గొంత కోసి హత్య చేశాడు.

భార్యను హత్య చేసిన అంజద్ ఇంట్లోని వస్తువులను చిందరవందరగా పడేసి దోపిడి దొంగల పనిగా నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే..పొంతన లేని సమాధానాలతో పోలీసులకు అతనిపైనే అనుమానం వచ్చింది. చుట్టుపక్కల వారి నుంచి వివరాలు తీసుకొని తమదైన స్టైల్ విచారణ చేపట్టడంతో అంజద్ తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. హత్య ఉపయోగించిన కత్తి, రక్తంతో తడిసిన దుస్తుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Tags

Next Story