కుక్క కోసం ఫ్లెక్సీ.. తిండి మానేసిన మరో కుక్క

కుక్క కోసం ఫ్లెక్సీ.. తిండి మానేసిన మరో కుక్క

అతనికి పెద్ద పెద్ద భవంతులు లేవు. చిన్న కుటీరంలో జీవనం సాగిస్తున్నాడు. కుల వృత్తి చేసుకుంటే తప్ప పూట గడవదు. అయితేనేం అతనికి జంతువులంటే మహా మక్కువ. వాటిపై ప్రేమతో రెండు కుక్కలను పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలో అందులో ఒకటి తప్పిపోయింది. దీంతో ఆ జంతు ప్రేమికుడి ఆవేదన అంతా ఇంతా కాదు. మామూలుగా మనం మనుషులు తప్పి పోతే ప్రకటనలు ఇస్తాం. పెద్ద పెద్ద పోస్టర్లు వేస్తాం. కానీ ఆ యువకుడు తన కుక్క కోసం ఫ్లెక్సీ వేయించడం విశేషం. ఇప్పుడీ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన సాలంకి శ్రీను కమ్మరి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం హైదరాబాద్‌ నుంచి ఒక కుక్క పిల్లను తెచ్చుకున్నాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుక్క.. ఈ నెల 8న కనిపించకుండాపోయింది. పట్టణం మొత్తం గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో కుక్క తప్పిపోయిందంటూ ఇలా వినూత్నంగా ఫ్లెక్సీ కట్టాడు. కుక్క కనిపించకపోవడంతో తన దగ్గర ఉన్న మరో కుక్క కూడా ఏమి తినడం లేదని చెబుతున్నాడు శ్రీను. తన కుక్క ఎవరికైనా కనిపిస్తే సమాచారం అందించాలని కోరుతున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story