నల్లమలలో దారుణం.. యువకుడిని నరబలి ఇచ్చిన..

కర్నూల్ జిల్లా నల్లమల అభయారణ్యంలో దారుణం జరిగింది. క్షుద్రపూజల కోసం గుర్తు తెలియని దుండగులు నరబలి ఇవ్వడం కలకలం రేపుతోంది. ఘటనా స్థలంలో ఓ యువకుడి మృతదేహాం లభ్యమైంది.
ఓ యువకున్ని నరబలి ఇచ్చిన దుండగులు...తల, దేహం వేరు చేసి.. పసుపు, కుంకుమ, నిమ్మకాయలు పెట్టి క్షుద్రపూజలు చేశారు. కర్నూలు-ప్రకాశం జిల్లాల సరిహద్దుల్లో.. నల్లమల అడవిలోని సరివెళ్ల మండలం పచ్చర్ల సర్వ నరసింహస్వామి గుడి దగ్గర యువకుడి మృతేదహాన్ని పోలీసులు గుర్తించారు.మృతుడి వయస్సు 30 ఏళ్లు ఉంటుందని భావిస్తున్నారు. గుప్తనిధుల కోసమే యువకున్ని నరబలి ఇచ్చారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.నల్లమల అడవుల్లో నరబలిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో సమీపంలోని గ్రామాల ప్రజలు ఉలిక్కిపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com