చిన్నారులు, మహిళలపై దాడులు చేసే వారిని కఠినంగా శిక్షిస్తాం - కిషన్‌ రెడ్డి

చిన్నారులు, మహిళలపై దాడులు చేసే వారిని కఠినంగా శిక్షిస్తాం - కిషన్‌ రెడ్డి

దేశంలో కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. పేద కుటుంబం నుంచి వచ్చిన మోదీకి ప్రజలు పట్టం కట్టారని చెప్పారు. తనను ఎంపీగా గెలిపించిన సికింద్రాబాద్‌ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ అమీర్ పేట్, బేగంపేట్ లో కృతజ్ఞతా యాత్రను నిర్వహించారాయన. తన విజయం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనను దీపించిన ప్రజల సేవకే అంకితమై పనిచేస్తానని స్పష్టం చేశారు.

చిన్నారులు, మహిళలపై జరుగుతున్న దాడుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. దేశంలో అమానుషాల‌కు పాల్ప‌డే వారికి ఉరిశిక్ష ర‌ద్దుచేసే ప్ర‌స‌క్తే లేద‌న్నారు. చిన్నారులు, మహిళలపై దాడులు చేసే వారిని కఠినంగా శిక్షించేందుకు మోదీ సర్కారు కొత్త చట్టాలను తీసుకొస్తోందని కిషన్‌ రెడ్డి తెలిపారు.

కృతజ్ఞతా యాత్ర అనంతరం బాగ్ అంబ‌ర్ పేట్ స‌త్యసాయి విద్యా విహార్ లో నిర్వ‌హించిన పాదుక‌పూజ‌ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. ప్ర‌భుత్వాలు చెయ్యలేని ప‌నుల‌ను కూడా పుట్ట‌ప‌ర్తి స‌త్య‌సాయి బాబా చేసి చూపించార‌ని కిష‌న్ రెడ్డి కొనియాడారు. స‌త్య‌సాయి సేవా ట్ర‌స్ట్ ద్వారా ఉచిత వైధ్యం, విధ్య తో పాటు దాహంతో అల‌మ‌టిస్తున్న ఎన్నో వేల గ్రామాల‌కు చినీరంతున్నాయ‌న్నారు. స్వామివారి ఆశిస్సులు అంద‌రికీ ఉండాల‌ని .. ఈ ఏడాది సుభిక్షంగా వ‌ర్ష‌లు కురిసి పంట‌లు సంవృద్దిగా పండేలా స‌త్య‌సాయి ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాన‌న్నారు.

Tags

Read MoreRead Less
Next Story