అక్కడ యథేచ్చగా లింగనిర్ధారణ పరీక్షలు..

అక్కడ యథేచ్చగా లింగనిర్ధారణ పరీక్షలు..

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యథేచ్చగా లింగనిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. పుట్టబోయేది ఆడ శిశువా, మగ సంతానమా ముందే చెప్పేస్తున్నారు డయాగ్నోస్టిక్ నిర్వాహకులు. హద్దులు దాటి లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న డయాగ్నోస్టిక్ సెంటర్ బాగోతాన్ని అండర్ కవర్ ఆపరేషన్ తో గుట్టు రట్టు చేశారు పోలీసులు. హైదరాబాద్ ఫిర్జాదీగూడలోని వెంకటేశ్వర డయాగ్నోస్టిక్ సెంటర్ లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు నిర్ధారించారు పోలీసులు.

గర్భంలో ఆడ సంతానమా? మగ సంతానమా తేల్చుకునేందుకు ఆరాటపడుతున్నారు తల్లిదండ్రులు. ఇక మగ సంతానంపై మక్కువతో ముందే లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రేజ్ నే క్యాష్ చేసుకుంటున్నాయి డయాగ్నొస్టిక్ సెంటర్లు. లింగనిర్ధారణ చేసేందుకు 10 వేల నుంచి 20 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి.

అండర్ కవర్ ఆపరేషన్ లో భాగంగా లేడి కానిస్టేబుల్ తో పాటు కానిస్టేబుల్ భార్యను పరీక్షకు పంపించి అక్రమార్కుల బండారం బయటపెట్టారు పోలీసులు. ఫిర్జాజీదీగూడలో వెంకటేశ్వర డయాగ్నోస్టిక్ బాగోతం బయటపడగా..అంతకుముందు ఇబ్రహీంపట్నంలోని అంకిత ఆస్పత్రిలోని నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన ఎస్.ఎస్. డయాగ్నోస్టిక్ గుట్టు రట్టు చేశారు.

కొద్దిరోజులకు ముందు చౌటుప్పల్ లోని లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తు బుక్కైపోయారు. న్యూ మెడ్విన్ ఆసుపత్రిలో బెదరకొండ ధనయ్య అనే మధ్యవర్తి సహాయంతో లింగ నిర్ధారణ చేస్తున్న వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆడ శిశువా, మగ శిశువా చెప్పేందుకు 14 వేల రూపాయలు వసూలు చేశారు. డబ్బు కోసం అడ్డదారులు తొక్కుతున్న డయాగ్నోస్టిక్ సెంటర్ల భరత పట్టేందుకు రాచకొండ పోలీసులు చేపట్టిన అండర్ కవర్ ఆపరేషన్ లో డయాగ్నోస్టిక్ సెంటర్ల బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story