ఉత్తుత్తి ఇంటర్వ్యూలు చేసి యువతను మోసం చేస్తారా - లోకేష్
జగన్ సర్కారుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మరోసారి విమర్శలు గుప్పించారు. గ్రామ వాలంటీర్ వ్యవస్థపై ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. అదేదో సినిమాలో ఉత్తుత్తి బ్యాంకు చూశాం.. జగన్ గారి కేసుల్లో ఉత్తుత్తి సంస్థల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వాలంటీర్ పోస్టులకు జరుగుతున్న ఉత్తుత్తి ఇంటర్వ్యూలను చూసి యువతను ఇలా మోసం చేస్తున్నారేంటా అని బాధపడుతున్నామంటూ.. ట్వీట్ చేశారు. పోస్టులను వైసీపీ నేతలు పంచేసుకుని అమ్మేసుకుని సొమ్ము చేసుకున్నాక.. ఉత్తుత్తి ఇంటర్వ్యూలు చేసి అమాయక యువతను మోసం చేస్తారా అంటూ ప్రశ్నించారు. దీనికి స్వచ్ఛంద దోపిడీ వ్యవస్థ అంటూ పేరు పెట్టాల్సిందంటూ లోకేష్ ఎద్దేవా చేశారు.
జగన్ గారూ! ఇందుకేనా మీరు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది. పోస్టులను వైసీపీ నేతలు పంచేసుకుని, అమ్మేసుకుని సొమ్ము చేసుకున్నాక, ఉత్తుత్తి ఇంటర్వ్యూలు చేసి అమాయక యువతను మోసం చేస్తారా? దీనికి స్వఛ్చంద దోపిడీ వ్యవస్థ అని పేరు పెట్టాల్సింది.
— Lokesh Nara (@naralokesh) July 13, 2019
Tags
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com