చినుకు రాలదు..... రైతుల చింత తీరదు!

వర్షాలు లేక రైతు అకాశం చూస్తున్నాడు. ఓ వైపు వేసిన పంటలు ఎండిపోతున్నాయి. మరోవైపు రైతన్నల కడుపులు మండిపోతున్నాయి. ఇప్పటికే విత్తనాలని, ఎరువులని భారీగా ఖర్చు చేశారు. వర్షాలు పడకపోతే.. తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. ఇది కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో పరిస్థితి.
కర్నూలు జిల్లా. అంటేనే కరువు జిల్లా. అందులోనూ కర్ణాటక సరిహద్దుల్లో ఉండే ఆలూరు గురించి చెప్పాల్సిన పనే లేదు. గత కొన్నేళ్లుగా..ఈ ప్రాంతంలో వర్షాల లేవు. ఫలితంగా పంటలు పండవు. దీంతో జనం వలసవెళ్లిపోతున్నారు. ఆలూరు వ్యవసాయ సబ్ డివిజన్‌లో ఉండే ఐదు మండలాల్లోనూ ఇదే పరిస్థితి. ఖరీఫ్‌సీజన్‌లో ఇక్కడ సాగు విస్తీర్ణం దాదాపు 70 వేల హెక్టార్లు. ఈ సీజన్‌లో వచ్చే వర్షాలను నమ్ముకుని.... రైతులు ఏటా.. వేరుశెనగ, పత్తి, కొర్ర, సజ్జ తదితర పంటలు వేస్తారు..... spot with వ్యవసాయంపైనే ఆధారపడే ఈ ప్రాంతంలో ... వానలు పడితే తప్ప పంటలు పండని పరిస్థితి. అయితే ఇప్పటికే వరుసగా ఐదేళ్ల వానలు పడలేదు. దీంతో రైతులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులకు గురయ్యారు. ఈ ఏడాది కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
ఈ సీజన్‌లో పడిన ముందస్తు వర్షాలతో... కేవలం పది వేల హెక్టార్లలో పత్తి, వేరుశెనగ తదితర పంటలు వేశారు రైతులు. కానీ ఇప్పటి వరకు వానల్లేవు. దీంతో.. వేసిన పంటలు ఎండిపోతున్నాయి. ఇక మిగిలిన 60 వేల హెక్టార్లలో అయితే... పంటలు సాగు చేయలేని పరిస్థితి ఏర్పడింది...వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం.... రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. పంటలసాగుకు ఇంకా సమయం ఉందని చెబుతున్నారు. ఒక వేళ వర్షాలు పడకపోతే.. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవచ్చంటూ సలహాలు చెబుతున్నారు.... రైతులు మాత్రం....... ఈ ఏడాది కూడా తమకు కలసి రాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగుకు పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదంటున్నారు. విత్తనాలు, ఎరువులు, పొలం దుక్కులకు పెట్టిన ఖర్చు...... మట్టి పాలు అవుతుందని ఆందోళన చెందుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com