బావిలో పడిన బాలిక..

బావిలో పడిన బాలిక..

నెల్లూరు జిల్లా కావలిలో ప్రమాదవశాత్తు ఓ బాలిక బావిలో పడింది. 16 ఏళ్ల శరణ్య తెల్లవారుజామున 4 గంటలకు ఇంటి ఆవరణలో ఉన్న బావిలో పడింది. ఉదయాన్నే లేచిన కూతురు చాలాసేపటి వరకు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికారు తల్లిదండ్రులు. చివరకు పెరట్లో ఉన్న బావిలో చూడగా.. మాట్లాడలేని పరిస్థితిలో శరణ్య బావిలో పడి ఉండడం గమనించారు. వెంటనే 108 సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక శాక సిబ్బంది సహాయంతో బాలికను బయటకు తీశారు. తల వెనుక భాగంలో కాళ్లకు, నడుమ భాగంలో గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story