టీడీపీ మద్దతుదారులంటూ పింఛన్ల నిలిపివేత
ఏపీలో ప్రభుత్వం మారింది. పథకాల లబ్ధిదారుల జాతకాలు మారుతన్నాయి. తాము టీడీపీ సానుభూతిపరులమంటూ పింఛన్లు ఇవ్వటం లేదంటూ వాపోతున్నారు కొందరు లబ్ధిదారులు. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పెద్దాపురం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 40 మంది లబ్ధిదారులు కళాకారుల పథకంలో గత ఐదేళ్లుగా పింఛన్లు తీసుకుంటున్నారు. అయితే.. వైసీపీ ప్రభుత్వం రావటంతో వారి పేర్లు లబ్ధిదారుల జాబితా నుంచి మాయం అయ్యాయి.
కళాకారుల పథకంలో పింఛన్లు తీసుకుంటున్న ఆ 40 మంది టీడీపీ సానుభూతి పరులు అన్నది వైసీపీ నేతల ఆరోపణ. అందుకే పింఛన్లు రావు అని స్థానిక వైసీపీ నాయకత్వం బెదిరింపులకు దిగుతోందని అన్నారు. అటు అధికారులకు కూడా హుకుం జారీ చేశారని చెబుతున్నారు. వారం నుంచి పింఛన్ల కోసం అధికారులను ప్రాధేయపడినా తమ గోడు ఎవరు పట్టించుకోవటం లేదని వాపోతున్నారు బాధితులు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com