అందువల్లే ఎన్నికల్లో ఓడాం - కోదండరాం

అందువల్లే ఎన్నికల్లో ఓడాం - కోదండరాం

తెలంగాణ జనసమితి తొలి ప్లీనరీ ఇవాళ హైదరాబాద్‌లో జరగనుంది. ఈ ప్లీనరీని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. పార్టీ పునర్నిర్మాణం, భవిష్యత్‌ కార్యచరణపై ఇందులో చర్చిస్తామన్నారు ఆ పార్టీ చీఫ్‌ కోదండరాం. ఎన్నో పోరాటాలు, ప్రాణత్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణలో...... నీళ్లు, నిధులు, నియామకాలా ఊసే లేదంటూ ఫైర్‌ అయ్యారు.

హైదరాబాద్‌లో ఇవాళ తెలంగాణ జసమితి మొదటి ప్లీనరీ సమావేశం జరగనుంది. దీనికి ప్రొఫెసర్‌ యోగేంద్ర యాదవ్‌ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఎన్నికల కారణంగా ప్లీనరీని రెండు నెలలు వాయిదా వేశారు. ఇవాళ జరిగే ఈ ప్లీనరిలో విద్య, వైద్యం, ఆరోగ్యం, సంక్షేమం లాంటి ఆరు అంశాలపై తీర్మానం చేయనున్నారు. దీంతో పాటు పార్టీ పునర్నిర్మాణం, రాజకీయ భవిష్యత్‌ కార్యచారణ వంటి అంశాలపై చర్చిస్తారు. అధ్యక్ష ఎన్నిక, ప్రతినిధుల సభ, ముగింపు సమావేశం జరుగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. సభకు సంబంధించి అన్ని అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు టీజేఎస్‌ చీఫ్‌ కోదండరామ్‌. .

కూటమిలో వ్యవస్థాగత లోపాల వల్లే గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యామన్నారు కోదండరాం. ఏడాది కాలంలో అనేక ఉద్యమాలు చేశామని... భవిష్యత్‌లో రాజకీయాల్లో మార్పు కోసం ప్రయత్నం చేస్తామన్నారు. అటవీ, నిరుద్యోగ, రైతుల సమస్యలపై టీజేఎస్‌ పోరాడుతుందన్నారాయన.

ఎన్నో పోరాటలు, ప్రాణత్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాల ఊసే లేదన్నారాయన. కాళేశ్వరం పేరుతో కోట్ల రూపాయలు వృధా చేశారని ఆరోపించారు. హైదరాబాద్‌లో జరిగే ప్లీనరిని విజయవంతం చేస్తామన్నారు కోదండరాం.

Tags

Read MoreRead Less
Next Story