మళ్ళీ అడవిలో అలజడి.. తెలంగాణ వైపు మావోయిస్టుల చూపు

మళ్ళీ అడవిలో అలజడి.. తెలంగాణ వైపు మావోయిస్టుల చూపు

మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. టీఆర్‌ఎస్‌ MPTC శ్రీనివాస్‌ను ఇన్‌ఫార్మర్‌ నెపంతో దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భయాందోళనలు నెలకొన్నాయి.

భద్రాద్రి కొత్తగూడం జిల్లాలో....కిడ్నాప్‌ చేసిన టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ నల్లూరు శ్రీనివాస్‌ను అత్యంత దారుణంగా హత్య చేశారు మావోయిస్టులు. ఇన్‌ఫార్మర్‌ నెపంతో ఆయన్ను గొడ్డళ్లతో నరికి చంపారు. తెలంగాణ - చత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని ఎర్రంపాటు, పొట్టెపాడు గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో శ్రీనివాస్‌ మృతదేహం లభ్యమైంది. డెడ్‌ బాడీ దగ్గర మావోయిస్టుల పేరుతో ఓ లేఖ కూడా ఉంది. ఇన్‌ఫార్మర్‌గా మారి మావోయిస్టుల సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నందునే చంపేసినట్లు లేఖలో పేర్కొన్నారు మావోయిస్టులు. చర్ల ఏరియా కమిటీ కార్యదర్శి శారద పేరుతో

ఈ లేఖను విడుదల చేశారు.....

నల్లూరు శ్రీనివాస్‌.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పెద్దమిడిసిరేరు ఎంపీటీసీగా ఉన్నారు. ఈ నెల 8 రాత్రిన ఆయన్ను 15 మంది సాయుధులైన మావోయిస్టులు... కిడ్నాపు చేశారు. భార్య, కుమారుడు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. శ్రీనివాస్‌ను ఆయన బైక్‌లోనే బలవంతంగా తీసుకెళ్లారు. అయితే నాలుగు రోజులు తర్వాత... శుక్రవారం ఆయన్ను చంపేశారు మావోయిస్టులు....శ్రీనివాస్‌ను ఇన్‌ఫార్మర్‌ నెపంతో చంపడం దారుణమన్నారు ఖమ్మం జిల్లా ఎస్పీ సునీల్‌ దత్‌. ఈ హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు.కొంత కాలం స్థబ్ధుగా ఉన్న మావోయిస్టులు.. ఇప్పుడు ఏకంగా అధికార ఎంపీటీసీ సభ్యుడిని కిడ్నాప్‌ చేసి చంపడం కలకలం రేపుతోంది. తాము ఉన్నామని గుర్తించేందుకు మావోయస్టులు ఈ చర్యకు దిగినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story