నీ కంటే రాజూనే ఎక్కువగా నచ్చాడు
టాలీవుడ్ రౌడీ ఫ్రస్టేషన్ హీరో విజయ దేవరకొండ దొరసాని సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఆనంద్‌దేవరకొండ- శివాత్మిక రాజశేఖర్ జంటగా నటించిన దొరసాని చిత్రాన్ని మెచ్చుకుంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. " మీ నటనను చూసి గర్వపడుతున్నాను. మై బాయ్( ఆనంద్‌దేవరకొండను ఉద్దేశిస్తూ) నీపై నా ప్రేమ అమితమైనది. కానీ సినిమాలోని రాజు పాత్రను నీకంటే ఎక్కువగా ప్రేమించాను. శివాత్మిక నటన కదిలిచింది. ఈ సినిమాకు పనిచేసిన తారాగణం పనితీరు అద్భుతం. కథ తెరపై చూడటానికి చాలా అందంగా ఉంది. కె.వి.ఆర్ మహేంద్ర, ప్రశాంత్ విహారీ , సన్నీ కురపతి కృషి అభినందనీయం. మనం త్వరలోనే ఖచ్చితంగా కలుస్తామని అనుకుంటున్నాను. మీ అందరికీ నా ధన్యవాదాలు. సినిమాను ప్రేమించే వారందరీకి ఈ కథ నచ్చుతుందని భావిస్తున్నాను ఆల్ ది బెస్ట్'' అంటూ .తన ట్వీట్‌లో తెలిపాడు విజయ్. శుక్రవారం విడుదలైన దొరసాని మూవీ మంచి టాక్ తెచ్చుకుంది.. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి ప్రశంసలు అందుతున్నాయి. పలువురు యువ దర్శకులు కూడా ఈ సినిమా స్పెషల్ షోని వీక్షించారు. సినిమా అద్భుతం అంటూ కితాబిచ్చారు.
#Dorasaani - you were a film I loved watching.
I am proud of you young actors. My boyy - I love you so much, but I loved Rajuu even more ???? Sivatmika - your performance was moving - The realism in every cast members performance and the storytelling was beautiful to watch.
— Vijay Deverakonda (@TheDeverakonda) July 13, 2019
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com