ఆటోడ్రైవర్‌ భార్యతో వస్త్రవ్యాపారి వివాహేతర సంబంధం.. చివరకు..

ఆటోడ్రైవర్‌ భార్యతో వస్త్రవ్యాపారి వివాహేతర సంబంధం.. చివరకు..

విజయనగరం జిల్లా సీతానగరం మండలం గుచ్చిమి గ్రామంలో వస్త్ర వ్యాపారి నాగేశ్వరరావు హత్య కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధమే కారణమని విచారణలో తేలింది. నాగేశ్వరరావుకు ఆటో డ్రైవర్‌ రామినాయుడుతో కొన్నాళ్లుగా పరిచయం ఉంది. రూ.2 లక్షలు అప్పు ఇచ్చాడు. తర్వాత ఆటో డ్రైవర్‌ భార్యతో వ్యాపారికి వివాహేతర సంబంధం ఏర్పడింది.

విషయం తెలుసుకున్న ఆటోడ్రైవర్‌, వ్యాపారి నాగేశ్వరరాను అంతం చేసేందుకు స్కెచ్‌ వేశాడు. మరో ఇద్దరు డ్రైవర్లకు డబ్బు ఆశచూపి మర్డర్‌కు ఒప్పించాడు. కొన్ని రోజులు వ్యాపారి కదలికలను గమనించారు. అప్పు తిరిగి చెల్లిస్తానని వ్యాపారిని పిలిచారు. బొబ్బిలి మండలం నారసింహునిపేటలోని నంద చెరువు వద్ద ముగ్గురు కలిసి వ్యాపారిని అడ్డగించారు. తమతో తెచ్చుకున్న రాడ్‌తో తల, మొహంపై విచక్షణారహితంగా కొట్టి చంపారు. ఎవరికీ అనుమానం రాకుండా దారిదోపిడీ హత్యగా చిత్రీకరించేందుకు మృతుడి ఆభరణాలు కొట్టేశారు. ఆ తర్వాత శవాన్ని చెరువు వద్ద పడేసి వెళ్లిపోయారు.

డయల్‌ 100 ద్వారా విషయం తెలసుకున్న పోలీసులు రంగంలో దిగారు. ఆభరణాలు అన్ని దొంగింలించిన నిందుతులు ఒక ఉంగరాన్ని వదిలేశారు. దీంతో ఇది దోపిడీ హత్యకాదని పోలీసులు నిర్ధారణకు వచ్చి, డాగ్‌ స్క్వాడ్‌, కాల్‌ డేటా, ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా విచారణ జరిపారు. చివరకు ఆటోడ్రైవర్‌ రామినాయుడే ప్రధాన నిందితుడిగా తేల్చారు. ఆ తర్వాత మరో ఇద్దరు నిందితులను అదుపులో తీసుకున్నారు. హత్య జరిగిన రెండే రోజే మర్డర్‌ మిస్టరీని ఛేదించిన పోలీసులను బొబ్బిలి ASP గౌతమిశాలిని అభినందించారు.

Tags

Next Story