ప్రపంచ క్రికెట్ చరిత్రలో కొత్త ఛాంపియన్..!

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రపంచ క్రికెట్ మహా సంగ్రామం ఆదివారం జరగబోతోంది. క్రికెట్‌కు పుట్టినిల్లు అయిన లార్డ్స్ మైదానం ఈ ప్రతిష్టాత్మక ఫైనల్‌కు వేదికగా నిలుస్తోంది. ఆతిథ్య ఇంగ్లండ్‌తో.. వరల్డ్ కప్ ట్రోఫీ కోసం న్యూజిలాండ్ సై అంటోంది. ఈ రెండు జట్లలో ఎవరు గెలిచిన కొత్త ఛాంపియన్‌గా చరిత్రలో నిలిచిపోతోంది. నాలుగోసారి ఫైనల్‌కు చేరిన ఇంగ్లండ్, రెండోసారి ఫైనల్‌కు చేరిన న్యూజిలాండ్‌లు తొలి టైటిల్ కోసం ఇప్పటికే అస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి.
క్రికెట్‌కు పుట్టినిల్లు అయిన ఇంగ్లండ్ కూడా తొలి కప్ కోసం ఆతృతగా ఎదురు చూస్తోంది. స్వదేశంలో వన్డే వరల్డ్‌కప్‌ను సాధించి తమ చిరకాల కోరిక తీర్చుకోవాలని ఆశ పడుతోంది. 27 ఏళ్ల తర్వాత మరోసారి ఫైనల్‌కు చేరిన క్రమంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మెగా ట్రోఫీని వదులుకోకూడదని ఇంగ్లండ్ భావిస్తోంది. న్యూజిలాండ్ కూడా తొలి వరల్డ్‌కప్‌పై కన్నేసింది. 12 సార్లు ప్రపంచ కప్ జరిగితే 8 సార్లు సెమీస్‌కు చేరిన రికార్డు కివీస్ టీమ్‌ది. కానీ ఆ జట్టు కేవలం రెండో సారి మాత్రమే ఫైనల్‌కు చేరుకోగలిగింది. గత టోర్నీలో ఫైనల్‌కు చేరినా రన్నరప్‌తో సంతృప్తి చెందింది. ఇప్పుడు ఇంగ్లండ్‌కు షాకివ్వాలని యోచిస్తోంది. టోర్నీలో హాట్ ఫేవరెట్ అయిన భారత్‌ను సెమీ ఫైనల్లో ఓడించి న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరుకోగా.. మరో ఫేవరెట్ జట్టు ఆసీస్‌ను చిత్తు చేసి ఇంగ్లండ్ తుది పోరుకు రెడీ అయింది. ప్రస్తుతం రెండు జట్లలోని కీలక ఆటగాళ్లు సూపర్ ఫాంలో ఉండడంతో ఫైనల్ పోరు రసవత్తరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. లీగ్ స్టేజ్‌లో ఈ రెండు జట్లు తలపడ్డ చివరి లీగ్‌లో.. ఇంగ్లండ్ 119 రన్స్ తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. మరోసారి అదే ఫీట్ రిపీట్ చేయాలని ఇంగ్లీష్ అభిమానులు ఆరాటపడుతున్నారు.
ఇంగ్లండ్ బలాలు చూస్తే.. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ కీలకప్లేయర్లు ఫాంలో ఉన్నారు. ముఖ్యంగా ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అంతా ధనాధన్ బ్యాటింగ్‌తో అదరగొడుతున్నారు. పరుగులు చేయడంలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. వన్ డౌన్ ప్లేయర్ జో రూట్ రెండు సెంచరీలు, 3 అర్థ సెంచరీలతో 549 పరుగులు చేసి.. టాప్‌స్కోరర్లలో ఒకడిగా ఉన్నాడు. ఓపెనర్ బెయిర్‌స్టో కుడా ధనాధన్ ఆటతో ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టిస్తున్నారు. 2 సెంచరీలు, 2 అర్థ సెంచరీలతో 496 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ జెసెన్ రాయ్ ఏడు మ్యాచ్‌ల్లో 1 సెంచరీ, 4 అర్థ సెంచరీలతో 426 పరుగులు చేశాడు. కెప్టెన్ మోర్గాన్ కూడా కీలక మ్యాచ్‌ల్లో అదరగొడుతున్నాడు. ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో 362 పరుగులు చేశాడు. ఈ నలుగురు బ్యాట్స్‌మెన్ ఫాం ఇంగ్లండ్‌ను హాట్ ఫేవరెట్‌గా నిలుపుతోంది. ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కూడా అవసరమైన సమయాల్లో చెలరేగుతున్నాడు. ఇక బౌలింగ్ విభాగం ఆర్చర్, వుడ్, వోక్స్‌తో భీకర ఫాంలో కనిపిస్తోంది. ఆర్చర్ 19, వుడ్ 17, వోక్స్ 13 వికెట్లతో ఇప్పటికే సత్తా చాటారు. అయితే స్పిన్నర్లు మాత్రం అంచనాలను అందుకోలేకపోవడం.. టాపార్డర్ ఫెయిలైతే.. మిడిలార్డ్‌లో ఆదుకునే బ్యాట్స్‌మెన్ కనిపించకపోవడం జట్టుకు మైనస్ అవుతోంది.
ఇక న్యూజిలాండ్ విషయానికి వస్తే.. పడుతూ లేస్తూ ఫైనల్‌కు చేరిన ఆ జట్టు ఆశలన్నీ కెప్టెన్ విలియమ్‌సన్ పైనే ఉన్నాయి. ప్రస్తుతం సూపర్ ఫాంలో ఉన్న విలియమ్‌సన్ ఇప్పటికే ఒంటిచేత్తో విజయాలు అందించాడు. విలియమ్సన్ ఆడిన 9 మ్యాచ్‌లో 2 సెంచరీలు, 2 అర్థ సెంచరీలతో 548 పరుగులు చేసి.. సూపర్ కెప్టెన్ అనిపించుకుంటున్నాడు. మరో ప్రధాన ఆటగాడు టేలర్ సైతం జట్టుకు అవసరమైన సమయాల్లో అదరగొడుతున్నాడు. సెంచరీ చేయకపోయినా కీలక సమయాల్లో మూడు అర్థ సెంచరీలతో 335 పరుగులు చేశాడు. ఇక మిడిలార్డర్‌లో నిషమ్ సైతం రాణిస్తుండడం కివీస్‌కు అడ్వాంటేజ్. ఇంగ్లండ్ బౌలింగ్‌తో పోలిస్తే న్యూజిలాండ్ బౌలింగ్ విభాగం మాత్రం చాలా పటిష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఫెర్గ్యూసన్ 18, ట్రెంట్ బోల్ట్ 17, హెన్రీ 13 వికెట్లతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను భయపెడుతున్నారు. ముఖ్యంగా ఆరంభంలోనే ప్రత్యర్థి జట్టును ట్రెంట్ బౌల్ట్ దెబ్బతీస్తున్నాడు. అయితే న్యూజిలాండ్ కీలక ఆటగాడు ఓపెనర్ గుఫ్టిల్ చెత్త ఫాం జట్టును కలవరపెడుతోంది. ఫైనల్‌లోనైనా అతడు రాణించాలని న్యూజిలాండ్ అభిమానులు ఆశిస్తున్నారు.. ప్రస్తుతం ఇరు జట్ల ఫాం చూస్తే న్యూజిలాండ్ బౌలర్లకు, ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌కు మధ్య జరిగే ఫైట్‌గా చూడొచ్చు.
వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనున్న ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంపై నుంచి రెండు రోజుల పాటు విమానాల రాకపోకలను నిలిపివేయనున్నారు. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌ను నోైఫ్లెజోన్‌గా ప్రకటించారని ఐసీసీ వెల్లడించింది. ఇటీవల ప్రపంచకప్ మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో ఛార్టెడ్ విమానాలు వివాదాస్పద సందేశాలతో కూడిన బ్యానర్లతో చక్కర్లు కొట్టాయి. దీంతో మ్యాచ్ జరిగే ఆదివారంతో పాటు రిజర్వ్‌డే సోమవారం కూడా నోఫ్లైజోన్‌గా ప్రకటించాలని సంబంధిత అధికారులకు ఐసీసీ విజ్ఞప్తి చేసింది. వాతావరణం మాత్రం ప్రపంచ క్రికెట్ అభిమానులు కాస్త గందరగోళానికి గురి చేస్తోంది. అయితే రిజర్వ్ డే ఉండడంతో అంతా కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com