బీజేపీ కార్యకర్తకు టీఆర్‌ఎస్‌ నేత బెదిరింపులు

బీజేపీ కార్యకర్తకు టీఆర్‌ఎస్‌ నేత బెదిరింపులు

నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నారంటూ అడ్డుకున్న బీజేపీ కార్యకర్తపై అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఓ నాయకుడు నోటికి ఇష్టం వచ్చినట్లు తిట్టాడు. అంతటి అగకుండా చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబ్ నగర్‌ జిల్లా నవాబ్‌ పేట మండలంలో చోటు చేసుకుంది. పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా జరుగుతున్న ఉదండాపూర్ రిజర్వాయర్ పనులకు చెరువులోని ఒండ్రుమట్టిని నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నారంటూ బీజేపీ పార్టీకి చెందిన వార్డు మెంబర్ సత్యం కాంట్రాక్టర్లను నిలదీశాడు. దీంతో అధికార పార్టీకి చెందిన అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మండల నాయకుడు నర్సింహులు.. సత్యంకు ఫోన్‌ చేసి పనులు ఎందుకు అడ్డుకుంటున్నావంటూ భూతులు తిట్టాడు. చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.

దీంతో సత్యం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి మండల కేంద్రంలో బీజేపీ నేతలతో కలసి దర్నాకు దిగారు. బెదిరింపులకు పాల్పడిన టీఆర్‌ఎస్ నాయకుడు నర్సింహులుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా పోలీస్ ఉన్నతాధికారు దృష్టికి తీసుకువెళ్లి న్యాయం కోసం పోరాటం చేస్తామని హెచ్చరించారు స్థానిక బీజేపీ నేతలు. అటు ఈఘటనకు సంబంధించి గతంలోనే ఫిర్యాదులున్నాయని వాటిపై కేసులు నమోదు అయ్యాయన్నారు స్థానిక ఎస్సై. వాటిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Read MoreRead Less
Next Story