అక్కడ ఏం కడదామని అంత తక్కువగా కేటాయించారు : చంద్రబాబు
వైసీపీ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. బడ్జెట్‌తో రాజధానికి కేవలం 500 కోట్లే కేటాయించారంటూ ఫైరయ్యారు చంద్రబాబు. ఏం కడదామని అంత తక్కువగా కేటాయించారంటూ ట్వీట్టర్ల వేదికగా ఫైర్ అయ్యారు. అటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సైతం.. వైసీపీ సర్కారుపై ట్విట్టర్‌లో విరుచుకుపడ్డారు. వాలంటీర్ పోస్టులకు ఉత్తుత్తి ఇంటర్వ్యూలు చేస్తారంటూ సెటైర్ వేశారు.
వైసీపీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను టార్గెట్ చేస్తూ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు చంద్రబాబు. జగన్ పాలనలో రానున్న రోజులు ఎంత అధ్వాన్నంగా ఉండబోతున్నాయో ప్రస్తుత బడ్జెట్ స్పష్టం చేస్తోందంటూ సెటైర్ వేశారు. అమ్మఒడి పథకానికి ఇన్ని ఆంక్షలా అంటూ ప్రశ్నించారు. హామీ ఇస్తే అమలు చేసే సత్తా ఉండాలని.. ఆ సత్తాగానీ, చిత్తశుద్ధిగానీ వైసీపీ ప్రభుత్వానికి లేదన్నారు చంద్రబాబు. ఇక... బడ్జెట్‌లో నిరుద్యోగుల ఊసు ఎందుకు లేదో చెప్పాలంటూ ట్వీట్టర్‌లో ప్రశ్నించారు చంద్రబాబు. నాడు వైసీపీ వేసిన లెక్కల ప్రకారం కోటీ 72 లక్షల మంది నిరుద్యోగులకు ఏమిస్తున్నారో జగన్ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
నోటికొచ్చిన హామీలతో జగన్ చిటకెల పందిరి కట్టారంటూ సెటైర్లు వేశారు. ఆ పందిరి మీద అభివృద్ధి, సంక్షేమాన్ని పాకించి పండిస్తామంటున్నారని.. అది అయ్యే పనేనా అని ప్రశ్నించారు. రాజధానికి 500 కోట్లు, కడప స్టీల్ ప్లాంట్ కు 250 కోట్లు కేటాయించి ఏం కట్టాలనుకుంటున్నరో చెప్పాలని ప్రశ్నించారు చంద్రబాబు. ప్రజల ఆకాంక్షలను ఎందుకిలా నీరుగార్చుతున్నారంటూ ఫైరయ్యారు. డ్వాక్రమహిళలకు ఐదేళ్ల పాటు 75 వేలు ఇస్తామన్నారని.. డ్వాక్రా రుణాలుకు కూడా రద్దు చేస్తామన్నారని గుర్తు చేశారు. బడ్జెట్‌లో డ్వాక్రా మహిళల ప్రస్తావన లేకుండా సున్నా వడ్డీ రుణాలకు 1788 కోట్లు కేటాయించి చేతులు దులిపేసుకున్నారంటూ విమర్శించారు. ఇంత మోసం తగదంటూ జగన్ సర్కారును టార్గెట్ చేస్తూ విమర్శించారు చంద్రబాబు.
మరోవైపు... టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సైతం ట్విట్టర్ వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు. గ్రామ వాలంటీర్ వ్యవస్థను విమర్శిస్తూ సైటైర్లు వేశారు. అదేదో సినిమాలో ఉత్తుత్తి బ్యాంకు చూశాం.. జగన్ గారి కేసుల్లో ఉత్తుత్తి సంస్థల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వాలంటీర్ పోస్టులకు జరుగుతున్న ఉత్తుత్తి ఇంటర్వ్యూలను చూస్తున్నామన్నారు. జగన్ ప్రభుత్వం.. యువతను ఇలా ఎందుకు మోసం చేస్తోందని బాధపడుతున్నామంటూ.. ట్వీట్ చేశారు. పోస్టులను వైసీపీ నేతలు పంచేసుకుని అమ్మేసుకుని సొమ్ము చేసుకున్నారంటూ ఎద్దేవా చేశారు. . ఉత్తుత్తి ఇంటర్వ్యూలు చేసి అమాయక యువతను మోసం చేస్తారా అంటూ ప్రశ్నించారు. దీనికి స్వచ్ఛంద దోపిడీ వ్యవస్థ అంటూ పేరు పెట్టాల్సిందన్నారు లోకేష్. ట్విట్టర్ వేదికగా అటు చంద్రబాబు, ఇటు లోకేష్.. ట్విట్ చేస్తుండటంతో.. రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com