సీఐ మానవత్వం .. ఏడుస్తున్న చిన్నారిని గుండెలకు హత్తుకుని ..

సీఐ మానవత్వం .. ఏడుస్తున్న చిన్నారిని గుండెలకు హత్తుకుని ..

అందరూ ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు. తనను అక్కడికి ఎందుకు తీసుకెళ్లారో తెలియదు. తన తల్లి చనిపోయిందని తెలియని ఆ చిన్నారి వెక్కి వెక్కి ఏడుస్తుండడం చూసి... స్థానిక సీఐ గుండెలకు హత్తుకుని ఓదార్చిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది.

వేములవాడ మండలం రుద్రారం గ్రామంలో నవ్య అనే వివాహిత కుటుంబ కలహాలతో ఒంటిపై కిరోసీన్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీంతో తన తల్లికి ఏమైందో తెలియని ఆ చిన్నారి... అమ్మ అమ్మ అని ఏడ్చింది. దీంతో విచారణ నిమిత్తం అక్కడకు చేరుకున్న సీఐ శ్రీనివాస్‌ చౌదరి... ఆ చిన్నారిని ఎత్తుకుని ఓదార్చారు. ఈ ఘటన అక్కడున్నవారిని కలచివేసింది.

Tags

Read MoreRead Less
Next Story