సెల్‌ఫోన్‌ దొంగను పట్టుకుని చితకబాదిన స్థానికులు

సెల్‌ఫోన్‌ దొంగను పట్టుకుని చితకబాదిన స్థానికులు

రాత్రి వేళల్లో కాలనీలో సంచరిస్తూ చోరీలకు స్కెచ్‌ వేస్తున్న ఓ యువకుడిని పట్టుకుని స్థానికులు దేహశుద్ధి చేశారు. సీసీ కెమెరా ద్వారా గుర్తించిన కాలనీవాసులు యువకుడిని పట్టుకుని స్తంభానికి కట్టేసి చితకబాదారు. ఆ తర్వాత పోలీసుకు అప్పగించారు. నిందితుడ్ని బిహార్‌కు చెందిన అమర్‌గా గుర్తించారు. ఈ ఘటన హైదరాబాద్‌ శంషాబాద్‌ మండలం ఇంద్రారెడ్డి కాలనీలో జరిగింది.

బిహార్‌కు చెందిన గోపాల్‌ దంపతులు కొంతకాలంగా శంషాబాద్‌ మండలంలోని ఇంద్రారెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు అమర్‌ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే కొన్నాళ్లుగా పలువురి ఇళ్లలో సెల్‌ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. అనుమానం వచ్చిన కాలనీవాసులు సీసీ కెమెరా ఫూటేజి చూశారు. అందులో రాత్రి వేళ అమర్‌ తిరగడాన్ని గమనించారు. ఆతర్వాత అమర్‌ను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. అతని వద్ద నుంచి ఓ ఖరీదైన ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story