సొంత నియోజకవర్గం పరిధిలో కిషన్‌రెడ్డి పర్యటన

సొంత నియోజకవర్గం పరిధిలో కిషన్‌రెడ్డి పర్యటన
X

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సొంత నియోజకవర్గం సికింద్రాబాద్‌ పరిధిలో పర్యటించారు. అంబర్‌పేటలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్ర చేపట్టారు. పర్యటనలో స్థానికుల సమస్యలు వింటూ, వినతి పత్రాలు స్వీకరించారు. సమస్యలను సాధ్యమైనంత తొందరగా పరిష్కరించాలని ఆధికారులను ఆదేశించారు కిషన్‌రెడ్డి.. ఉగ్రవాద నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు కిషన్‌రెడ్డి. ఉరి శిక్షను రద్దు చేయాలని కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్ ను తాము పట్టించుకోబోమన్నారు. మహిళలపై దాడులు చేసే వారిని కఠినంగా శిక్షించేందుకు మోడీ సర్కారు కొత్త చట్టాలను తీసుకొస్తోందన్నారు.

Tags

Next Story