పెళ్ళైన మూడు రోజులకే ప్రియుడితో వెళ్లిపోయిన కూతుర్ని..

పెళ్ళైన మూడు రోజులకే ప్రియుడితో వెళ్లిపోయిన కూతుర్ని..

నల్లగొండ జిల్లాలో.... కన్న కూతురుని హతమార్చేందుకు ప్రయత్నించాడు ఓ తండ్రి. ఈ ఘటన చౌటుప్పల్‌ మండలం పంతంగి గ్రామంలో జరిగింది. తండ్రి దాడి చేయడంతో.. కూతురు తీవ్రంగా గాయపడింది. ఆమెను హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లోని ఆసుపత్రికి తరలించారు. వేరే కులం వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకే.... కూతురుపై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు ఆ తండ్రి

పంతంగి గ్రామానికి చెందిన యాదయ్య.... తన రెండో కూతురు స్నేహాంజలిని... అబ్దుల్లా పూర్‌ మెట్‌కు చెందిన నరేష్‌తో ఈ నెల 14న పెళ్లి చేశాడు. అయితే..పెళ్లైన మూడ్రోజులకే స్నేహాంజలి... తన ప్రియుడు శేఖర్‌తో వెళ్లిపోయింది. దీంతో శేఖర్‌పై .... స్నేహాంజలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది. చివరకు అమ్మాయిని మందలించి.. తిరిగి అత్తగారింటికి పంపించారు. ...

అయితే... స్నేహాంజలి మరోసారి ప్రియుడితో వెళ్లిపోయింది. దీంతో.... ఆగ్రహించిన తండ్రి యాదయ్య....ఆమెను గొంతు నులిమలని చూశాడు. అయితే... ఆఖరి నిమిషంలో తండ్రి ప్రేమ అడ్డురావడంతో వదిలేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చారు. బాధితురాలిని ఆసుపత్రికి తరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చికిత్స పొందుతోంది స్నేహాంజలి. పోలీసులు యాదయ్యపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story