ఈసారి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెరాసకు 106 స్థానాలు: తలసాని

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ముందగానే జరగే అవకాశం ఉందన్నారు మంత్రి తలసాని యాదవ్? గతంలో 150కి 99 సీట్లు గెలిచిన టిఆర్‌ఎస్.. ఈ సారి 106 స్థానాలు పక్కాగా గెలుస్తుందని జోస్యం చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
ఉచితంగా పార్టీ సభ్యత్వాన్ని అందజేస్తున్న బీజేపీకి కోట్లాది రూపాయల పార్టీ ఫండ్ ఎలా వస్తుందని తలసాని ప్రశ్నించారు. మలక్‌పేట నియోజకవర్గ పరిధిలోని గడ్డి అన్నారం బస్తీ, యాకత్ పుర పరిధిలోని వినయ్ కమిటీ హాల్, బహదూర్ పురల్లో నిర్వహించిన పార్టీ సభ్యత్వనమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పలువురికి పార్టీ సభ్యత్వం అందించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులై అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా సభ్యత్వ నమోదు కోసం ముందుకొస్తున్నారన్నారు..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com