పుట్టిన పిల్లలు ఇద్దరూ మూగవారు కావడంతో మనస్తాపం చెందిన తల్లి..

పుట్టిన పిల్లలు ఇద్దరూ మూగవారు కావడంతో మనస్తాపం చెందిన తల్లి..

విశాఖ జిల్లా పెందుర్తి మండలం గొల్లనారాయణపురంలో విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. పుట్టిన పిల్లలు ఇద్దరూ మూగవారు కావడంతో మనస్తాపం చెందినన తల్లి అనిత.. తన ఆరేళ్ల కొడుకు ఉమామహేష్‌, 9 ఏళ్ల కూతురు రమ్యశ్రీతో కలిసి పరుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

గ్రామంలోని నూకాలమ్మ అమ్మవారి సన్నిధిలో తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం గ్రామస్తులను కంటతడిపెట్టించింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పెందుర్తి పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

Tags

Next Story