ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడి గండం!

ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడి గండం!

ఎప్పుడా ఎప్పుడా అని ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆశిస్తున్న మహా సంగ్రామం మరికాసేపట్లో ప్రారంభం అవుతోంది. క్రికెట్‌ పుట్టినిళ్లు లార్డ్స్‌లో తొలి వరల్డ్‌ కప్‌ను ముద్దాడేందుకు ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌లు ఢీ అంటే ఢీ అంటున్నాయి. అయితే ఫైనల్ మ్యాచ్ కు కూడా వరుణుడి గండం తప్పేలా లేదు. ఈ రోజు కూడా ఆకాశం మేఘావృతంగా కనిపిస్తోంది.

వాతావరణ శాఖ మంత్రం పెద్దగా టెన్షన్ అవసరం లేదంటోంది. చిరుజల్లులు తప్ప.. పెద్దగా వర్షం పడే అవకాశం లేదంటోంది. మరోవైపు శనివారం వరకు పిచ్‌పై సన్నటి పొరలా పచ్చిక ఉంది. వేడి ప్రభావంతో ఆదివారం మ్యాచ్‌ సమయానికి అది ఎండిపోవచ్చు. దీంతో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించవచ్చు. ఇక్కడ జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండుసార్లు 300+ స్కోరు నమోదయ్దియాయి. ఇక టాస్‌ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్‌కు దిగే అవకాశం ఉంది.

ఊహించని విధంగా ఒకవేళ మ్యాచ్ ను వరుణుడు అడ్డుకుంటే.. ఫైనల్‌కూ రిజర్వ్‌ డే ఉంది. ఒకవేళ ఫైనల్‌ టై అయితే సూపర్‌ ఓవర్‌ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. మ్యాచ్‌ రద్దయితే మాత్రం రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story