ముగ్గురి ప్రాణం తీసిన జాయ్‌రైడ్

ముగ్గురి ప్రాణం తీసిన జాయ్‌రైడ్

గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని అ‍డ్వెంచర్‌ పార్క్‌లో ఘోర ప్రమాదం జరిగింది. జాయ్‌రైడ్ అకస్మాత్తుగా కూలిపోవడంతో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా..30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో పార్క్‌లో ఉన్నవారంత ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ముగ్గురి మృతితో ఆయా కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ప్రధాన షాఫ్ట్ పైపు విరిగడంతోనే ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డ వారిని మణినగర్‌లోని ఎల్‌జీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పార్క్‌ నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story