నేను చేసిన పొరపాటు వల్లే న్యూజిలాండ్.. : బెన్‌స్టోక్స్

ఫైనల్స్‌లో భారత జట్టు లేదు. కొంత నిరాశే అయినా.. ఎవరు గెలుస్తారో.. ఎవరిని వరిస్తుందో కప్పు.. క్రికెట్ అభిమానులు అన్యమనస్కంగానే టీవీల ముందు కూర్చున్నారు. కానీ మ్యాచ్ మజాగా సాగుతోంది.. ఇంకా చెప్పాలంటే మ్యాచ్ అంటే ఇలానే ఉండాలి అనేలా ఒకరిపై ఒకరు కసిగా తలపడుతున్నారు. చివరి వరకు ఎవరు విజేతో తెలియనంత ఉత్కంఠభరితంగా సాగింది. లండన్‌లోని లార్డ్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌ని రెప్ప వాల్చకుండా చూశారు క్రికెట్ ప్రియులు. ఇంగ్లాండ్ విజేతగా నిలిచి కప్ అందుకున్న క్షణాన.. అత్యధిక స్కోర్‌ను సాధించి ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. సచిన్ టెండూల్కర్ ఈ అవార్డును ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా బెన్‌స్టోక్స్ మాట్లాడుతూ.. తాను ఉద్దేశపూరకంగా బంతికి బ్యాట్‌ను అడ్డు పెట్టలేదని బెన్‌స్టోక్స్ వివరణ ఇచ్చుకున్నాడు. అనుకోకుండా చోటు చేసుకున్న ఘటన అని, దాని వల్ల మ్యాచ్ టైగా ముగిసిందని బెన్‌స్టోక్స్ వివరించాడు. అందుకే కేన్ విలియమన్స్‌కు తన జీవిత కాలం పాటు క్షమాపణ కోరుతున్నానని అన్నాడు.
ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో ట్రెంట్ బౌల్ట్ వేసిన 4వ బంతిని స్టోక్స్ డీప్ మిడ్ వికెట్ దిశగా బాది రెండో పరుగు తీసే క్రమంలో బెన్ స్టోక్స్ కీపర్ ఎండ్‌కు వెళుతూ రనౌట్ నుంచి తప్పించుకోవడానికి క్రీజులోకి డైవ్ చేశాడు. న్యూజీలాండ్ ఫీల్డర్ నుంచి వచ్చిన బంతి స్టోక్స్‌కు తగిలి బౌండరీకి వెళ్లింది. దీంతో ఆ బంతికి మొత్తం ఆరు పరుగులు వచ్చాయి. స్టోక్స్ మొదట చేసిన రెండు పరుగులతో పాటు.. బంతి బౌండరీని తగలడం వల్ల వచ్చిన నాలుగు పరుగులను ఇంగ్లండ్ ఖాతాలో వేశారు. ఆ పరుగులే కనుక లేకపోయి ఉంటే మ్యాచ్ న్యూజిలాండ్ గెలిచి ఉండేదే. ఈ మ్యాచ్‌లో బెన్‌స్టోక్స్ మరోసారి ఇంగ్లండ్ టీమ్‌కు ఆపద్బాంధవుడయ్యాడు. 84 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఇంగ్లాడ్‌కి కప్ అందించాడు. ఆ దేశ క్రికెట్ అభిమానుల చిరకాల వాంఛ తీర్చాడు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com