కన్‌స్ట్రక్షన్ రంగంలో కెరీర్ అవకాశాలు..

రోజూ వెళ్లే దారే.. పెద్ద ఖాళీ స్థలం. ఆర్నెల్లు పోయేసరికి అక్కడో పెద్ద అపార్ట్ మెంట్ వెలుస్తుంది. ఎప్పుడు కట్టారో అని ఆశ్చర్యం. కట్టే కూలీలు మాత్రమే కనిపిస్తారు. కానీ ఆ భవన రూపకల్పనకు ఎంతో మంది పని చేసి ఉంటారు. ప్రస్తుతం నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. యువతకు ఈ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాణ రంగంలో కొలువులు, కోర్సుల గురించి తెలుసుకుందాం..
డిజైనింగ్, ప్లానింగ్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ తదితర విభాగాల్లో పెద్ద సంఖ్యలో కొలువులను అందుబాటులోకి తెస్తుంది నిర్మాణ రంగం. ఒక్క నివాస యోగ్యాలే కాదు.. క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్ కోర్టులు, స్టేడియంలు, ఫ్యాక్టరీలు, హాస్పిటల్స్, స్కూల్స్, రైల్వేలు, టన్నెల్స్, డ్యామ్‌లు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు.. ఇలా విభిన్న కార్యకలాపాల్లో నిర్మాణ రంగం పాలుపంచుకుంటోంది. కొత్త నిర్మాణాలే కాదు, పాత వాటికి మరమ్మతులు చేపట్టి కొత్త వాటిలా అందంగా తీర్చిదిద్దడానికి కూడా నిపుణుల సహాయం అవసరమవుతుంది. దేశంలో నిర్మాణ రంగం రోజు రోజుకు వృద్ధి చెందుతోంది. 2023 నాటికి భారత నిర్మాణ రంగం 690 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది.
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి నిర్మాణ రంగంలో అందుబాటులో ఉన్న ఉద్యోగాలు.. ఆర్కిటెక్ట్స్, ఆర్కిటెక్చర్ టెక్నాలజిస్టులు, బిల్డింగ్ సర్వీసెస్ ఇంజనీర్లు, బిల్డింగ్ సర్వేయర్లు, సివిల్ స్ట్రక్చరల్, జియోటెక్నికల్ ఇంజనీర్లు, ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్ట్,క్వాంటిటీ సర్వేయర్లు, సైట్ ఇంజనీర్లు, నిర్మాణ రంగంలో పెద్ద పెద్ద కన్‌స్ట్రక్షన్ కంపెనీలు, కన్సల్టెంట్లు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లు.
భారత్‌లో కొన్ని ఇనిస్టిట్యూట్స్ మాత్రమే కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్‌ను అందిస్తున్నాయి. దీంతో నిర్మాణ రంగంలో నిపుణుల కొరత ఎక్కువగా ఉంది.
నిక్మర్.. కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ కోర్సులకు నిక్మర్ ప్రసిద్దిగాంచింది. ముంబై, పుణే, హైదరాబాద్, గోవా, ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలో క్యాంపస్‌లు ఉన్నాయి. ఇందులో డిస్టెన్స్ లెర్నింగ్ కూడా చేసే వీలుంది.
ఏడాది వ్యవధిగల పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు..
1. క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్ మేనేజ్‌మెంట్
2. మేనేజ్‌మెంట్ ఆఫ్ ఫ్యామిలీ ఓన్డ్ కన్‌స్ట్రక్షన్ బిజినెస్
3. కాంటెంపరరీ స్మార్ట్ సిటీస్ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్.. దీనికి సంబంధించి పూర్తి వివరాలకు www.nicmar.ac.in
ఢిల్లీ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ గుర్తింపు పొందిన మరో సంస్థ. ఇక్కడ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌తో పాటు పీహెచ్‌డీలో కూడా ప్రవేశం కల్పిస్తోంది. పూర్తి వివరాలకు: http://spa.ac.in
సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ (సీఈపీటీ) ఆర్కిటెక్చర్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్: https://cept.ac.in/programmes
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్..ఏడాది వ్యవధి ఉన్న ఈ కోర్సును పూర్తి చేస్తే ఉద్యోగ నైపుణ్యాలను సొంతం చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.isb.edu
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్.. కన్‌స్ట్రక్షన్లో స్పెషలైజేషన్ అందిస్తోంది. పూర్తి వివరాలకు: www.iitm.ac.in
నిర్మాణ రంగానికి సంబంధించి కోర్సులను అందించే మరికొన్ని సంస్థలు..
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఢిల్లీ.. ఎంటెక్ ఇన్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్.. ఎంటెక్ ఇన్ కన్‌స్ట్రక్షన్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్.. పూర్తి విరాలకు వెబ్‌సైట్: www.iitd.ac.in.. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్), సురత్‌కల్.. ఎంటెక్ ఇన్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్.. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్: www.nitk.ac.in
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com