పిచ్చోడి చేతిలో రాయిలా మారింది : చంద్రబాబు

వైసీపీకి అధికారం ఇవ్వడం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. వారి వ్యవహార శైలి విధ్వంసకర ధోరణిలో ఉందన్నారు... తెలుగుదేశం నిర్మించిన వ్యవస్థలను కూల్చడమే ధ్యేయంగా వైసీపీ పనిచేస్తోందని ఆరోపించారు.. ఏదో ఓ రకంగా పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణ పనులు, ఇతర ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రతిష్టంభన తేవడనే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. పీపీఏలపై కేంద్రం ఒక రకంగా చెబుతుంటే.. వైసీపీ ప్రభుత్వం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. గత టీడీపీ సర్కారుపై బురద జల్లడమే టార్గెట్ గా పెట్టుకొని.. అభివృద్ధికి గండికొడుతున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు... వైసీపీ వ్యవహార శైలితో పోలవరం తోపాటు రాజధాని నిలిచిపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు...అమరావతిలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్యనేతలో సమావేశం అయ్యారు చంద్రబాబు.
అటు టీడీపీ నేతలు కూడా వైసీపీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానసర్వీసుల రద్దువల్ల పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు రాష్ట్రానికి వచ్చే పరిస్థితిలేకుండా పోయిందన్నారు.. పలు కంపెనీలు కూడా పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయని చెప్పారు..మాట్లాడితే ప్రతిదానికి
"చేపల లెక్కలు" అని ఆర్థిక మంత్రి బుగ్గన ఎద్దేవా చేయడం మత్య్సకారులను అవమానించడమే అని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com