ఎస్సై అవినీతి భాగోతం

ఎస్సై అవినీతి భాగోతం
X

సామాన్యులకు రక్షణగా ఉండాల్సిన వారే భక్షకులవుతున్నారు.. లంచాలు మరిగి అన్యాయాలకు పాల్పడుతున్నారు.. సిద్దిపేట జిల్లాలో ఓ ఎస్సై అవినీతి వ్యవహారం వెలుగు చూసింది.. భారీగా లంచం డిమాండ్‌ చేసిన బెజ్జంకి ఎస్సై.. లంచం తీసుకుని అడ్డంగా బుక్కయ్యాడు.. ఎస్సై అవినీతి, అరాచకాలపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. బాధితుడి దగ్గర్నుంచి ఎస్సై లంచం డిమాండ్‌ చేసిన దానికి సంబంధించిన ఫోన్‌ సంభాషణలు వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు చర్యలకు సిద్ధమవుతున్నారు.

బెజ్జంకి మండలం తోటపల్లికి చెందిన బోయిని కృష్ణారావు రాజీవ్‌ రహదారి పక్కనే బ్రిక్స్‌ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నాడు.. గత నెల 3న సిమెంటు బస్తాలు కొనుగోలు చేసిన వ్యవహారంలో కృష్ణారావును ఎస్సై అభిలాష్‌, కానిస్టేబుల్‌ నాగరాజు పీఎస్‌కు తీసుకెళ్లారు.. దొంగతనం చేసిన సిమెంట్‌ను కొన్నావంటూ కృష్ణారావుపై బెదిరింపులకు దిగారు. కేసు పెట్టకుండా ఉండాలంటే మొత్తాన్ని చెల్లించాలని సూచించారు.. ఎస్సై సూచించినట్లుగానే 3.43 లక్షల రూపాయలు కానిస్టేబుల్‌ నాగరాజుకు చెల్లించాడు కృష్ణారావు.. ఆ తర్వాత కేసు సెటిల్‌ చేసినందుకు మరో లక్ష రూపాయలు ఇవ్వాలని ఎస్సై అభిలాష్‌ డిమాండ్‌ చేయగా.. ఆ మొత్తాన్ని కానిస్టేబుల్‌కు చెల్లించినట్లు కృష్ణారావుచెబుతున్నాడు.. ఈ వ్యవహారం జరిగిన తర్వాత కూడా కృష్ణారావుపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వంద సిమెంటు బస్తాలు రికవరీ చేసినట్లుగా చూపించారు. అడిగినంత ఇచ్చిన తర్వాత కూడా కేసు పెట్టడంతో కృష్ణారావు సిద్దిపేట సీపీని ఆశ్రయించాడు.. ఎస్సై లంచం డిమాండ్‌ చేసిన ఆడియో క్లిప్‌పులను కూడా ఉన్నతాధికారులకు అందజేశాడు.ఘటనపై విచారణ చేపట్టిన సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌.. ఇద్దరిపైనా బదిలీ వేటు వేశారు.. విచారణ జరిపి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Tags

Next Story