రాత్రయితే చాలు భయంకరమైన శబ్దాలు.. హడలిపోతున్న విద్యార్థులు..
కర్నూలు జిల్లా సి.బెలగల్ ఆదర్శ స్కూల్ హాస్టల్ విద్యార్థినులకు దెయ్యం భయం పట్టుకుంది. రాత్రి భయంకరమైన శబ్దాలు వస్తున్నాయంటూ హడలిపోతున్నారు. టెన్షన్ భరించలేక తల్లిదండ్రులను పిలిపించుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. విద్యార్థినులంతా వెళ్లిపోవడంతో హాస్టల్ ఖాళీగా మారింది. వార్డెన్ ఎంత నచ్చజెప్పినా తల్లిదండ్రులు వినలేదు. దెయ్యాలున్న హాస్టల్‌లో ఉంచలేమని తీసుకెళ్లారు.
ఆదర్శ పాఠశాలలో 75 మంది విద్యార్థినులు చదువుతున్నారు. కొత్తగా వచ్చిన 9వ తరగతి విద్యార్థినికి ఒక రాత్రి విచిత్రమైన అరుపులు, భయంకర శబ్దాలు వినిపించాయట. ఆ విషయం తోటి విద్యార్థినులకు చెప్పడంతో దెయ్యాల పుకారు హాస్టల్ మొత్తం వ్యాపించింది. సాయంత్రమైతే విద్యార్థినులు తీవ్రంగా భయపడేవారు. కొందరు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. వాళ్లు వచ్చి పిల్లల్ని తీసుకెళ్లారు. కొండ ప్రాంతం కావడంతో పక్షులు, జంతువుల శబ్దాలు సహజమేనని వార్డెన్ అంటున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com