రేపు తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

రేపు తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

రేపు తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో అష్టదల పాదపద్మారాధన సేవ రద్దు చేశారు. సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు సర్వదర్శననానికి భక్తులను అనుమతిస్తారు. ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశికి ముందు వచ్చే మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా పండితులు ఏర్పాట్లు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story