పొగతో ఊపిరాడక విద్యార్థిని మృతి

పొగతో ఊపిరాడక విద్యార్థిని మృతి

రాక రాక ఒక్క చిన్న వర్షం వచ్చింది. ఆ వర్షానికి హాస్టల్ లో షార్ట్‌ సర్క్యూట్‌ కావడంతో అభం శుభం తెలియని నాలుగో తరగతి చిన్నారి స్పందన మృతి చెందింది. మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఖమ్మం SSP కాలనీలోని SC బాలికల హాస్టల్ లో ఒక్కసారిగా షార్ట్ సర్యూట్ జరిగింది. బెడ్‌మీద ఉన్న పరుపులు కాలిపోయాయి. రాత్రి 11 గంటల తరువాత ఈ ఘటన జరిగింది. దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. అయితే.. అదే సమయంలో బిల్డింగ్ పక్కనే ఉన్న పలువురు యువకులు హాస్టల్లో ఉన్న చిన్నారులను బయటకు తీసుకు వచ్చారు. అయితే..అప్సటికే స్పందన అనే నాలుగో తరగతి చదువుతున్న బాలిక పొగ దాటికి తట్టుకోలేక చనిపోయింది. బాలిక మృతదేహం నల్లగా మారిపోయింది. అప్పటికే పొగలు వ్యాపించడం.. బయటకు వచ్చే మార్గం లేకపోవడంతో చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హాస్టల్ మొత్తం చిన్నారుల రోదనలతో మిన్నంటింది.

హాస్టల్ లో ఆరో తరగతి వరకు చదువుకునే 35 మంది విద్యార్థినులు మాత్రమే ఉన్నారు. వారిలో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థానికుల సహకారంతో, సిబ్బంది హుటా హుటిని పిల్లలను బయటకు తీసుకుని రావడంతో పెను ప్రమాదం తప్పింది. సంఘటన గురించి సమాచారం అందుకున్న పైర్ సిబ్బంది సకాలంలో సంఘటన స్థలానికి వచ్చి కరెంట్ ను నిలిపివేసి మంటలను ఆర్పారు. సంఘటనపై విచారణ చేస్తున్నామని SC సంక్షేమ శాఖ డి.డి. సత్యనారాయణ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story