జార్ఖండ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ధోని?

జార్ఖండ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ధోని?

మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ఎప్పుడు? ఇప్పుడిది మిలియన్ డాలర్ల ప్రశ్న. వాస్తవానికి వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ధోనీ తన రిటైర్మెంట్ పై ప్రకటన చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఇంతవరకు ఆ దిశగా ఎలాంటి హింట్స్ ఇవ్వలేదు మిస్టర్ కూల్. ఇంతకీ ధోనీ మనసులో ఏముంది? ఇంకా కొంతకాలం ఆడాలనుకుంటున్నాడా? లేక ఫేర్ వెల్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాడా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇంగ్లండ్ లో జరిగిన వరల్డ్ కప్ లో ధోనీ సూపర్ హిట్టయ్యుంటే ..రిటైర్మెంట్ పై ఎవరూ వేలెత్తిచూపేవారు కాదు. కానీ గొప్ప ఫినిషర్ గా పేరున్న ఈ జార్ఖండ్ డైనమెట్ ఈసారి సరిగా పేలలేదు. అందుకే ఇప్పుడంతా అతడి రిటైర్మెంట్ పైనే చర్చ నడుస్తోంది..

త్వరలోనే వెస్టిండీస్ టూర్ ఉంది..అందులో టీ-ట్వంటీలు, వన్డేలతోపాటు టెస్టులు కూడా ఆడనుంది టీమిండియా . ఇందుకోసం జట్టును ప్రకటించాల్సి ఉంది. కానీ ఇంతవరకు ఆ తేదీ ఖరారు కాలేదు. ధోనీ రిటైర్మెంట్ పై క్లారిటీ లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. త్వరలోనే చీఫ్ సెలక్టర్ MSK ప్రసాద్ ...ధోనీని కలువనున్నట్లు సమాచారం. ఈ భేటీ తర్వాత రిటైర్మెంట్ పై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ తనంత తానుగా తప్పుకునేందుకు ధోనీ ఒప్పుకోకపోతే.. టీంలోకి సెలక్ట్ చేయకపోవచ్చని సమాచారం. అదే జరిగితే ధోనీకి చాలా పెద్ద అవమానం కిందే లెక్క. అందుకే అతడిని గౌరవంగా తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ధోనీయే స్వయంగా రిటైర్మెంట్ ప్రకటిస్తే..ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే లెజెండ్ క్రికెటర్ అయిన ధోనికి ఫేర్ వెల్ మ్యాచ్ ఆడే ఛాన్స్ ఇవ్వాలన్న డిమాండ్ కూడా వినిపిసోంది..

2020లో టీ-ట్వంటీ వరల్డ్ కప్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టాల్సి ఉంటుంది. ధోనీ తప్పుకుంటే ఆ ప్లేస్ ను భర్తీ చేసేందుకు ...రిషబ్ పంత్ సిద్ధంగా ఉన్నాడు. వాస్తవానికి మొన్నటి వరల్డ్ కప్ టీమ్ లోనే ఈ మార్పు జరగాల్సింది. అయితే అనుభవానికే పెద్దపీట వేసిన సెలక్టర్లు ..ధోనిని తప్పించే సాహసం చేయలేదు.. కానీ ఇప్పుడు ఆ సమయం వచ్చిందని మెజార్టీ క్రికెటర్లు అభిప్రాయ పడుతున్నారు. ధోనీ తప్పుకొని యువతరానికి ఛాన్స్ ఇవ్వాలన్న డిమాండ్ పెరిగిపోతోంది.

ధోనీ ప్రపంచ క్రికెట్ లోని అత్యుత్తమ ఫినిషర్లలో ఒక్కడు. ఇందులో ఎలాంటి అనుమానాల్లేవ్. గతంలోనూ ఎన్నో మ్యాచులను ఒంటిచేత్తో గెలిపించాడు. బాల్స్ తక్కువగా ఉండి..చేయాల్సిన పరుగులు ఎక్కువగా ఉంటే..ఒత్తిడి ధోనీపై కాదు, బౌలర్ పైనే అనేవారు. అలా ఉండేది ధోనీ బ్యాటింగ్ తీరు. కానీ కొంత కాలంగా ఆ వేగం తగ్గింది. ఒకప్పటిలా దాటిగా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. అయితే వరల్డ్ కప్ కు ముందు జరిగిన ఐపీఎల్ లో ఫర్వాలేదనిపించాడు ధోనీ. అందుకే వరల్డ్ కప్ లోనూ ఆ జోష్ చూపిస్తాడని అంతా భావించారు. కానీ స్లాగ్ ఓవర్లలో వేగంగా పరులుగు చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు ధోనీ. ముఖ్యంగా ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో బ్యాటింగ్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అటు కీలకమైన సెమీస్ లో నూ మిస్టర్ కూల్ ని దురదృష్టం వెంటాడటంతో రనౌట్ అయ్యాడు.. ఆ మ్యాచ్ ను గనుక ధోనీ గెలిపించి ఉంటే..ఇప్పుడు పరిస్థితి మరోలా ఉండేది...

2004లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ధోనీ ఇప్పటి వరకు 350 వన్డేలు ఆడాడు. 50.6 సగటుతో 10, 773 రన్స్ చేశాడు. ఈ వరల్డ్ కప్ లో ధోనీ కేవలం 273 రన్సే చేశాడు. సగటు కూడా 45 గానే ఉంది.. వాస్తవానికి ధోనీ మరీ చెత్తగా ఏం ఆడలేదు. కానీ అంచనాలకు తగ్గట్లుగా రాణించలేకపోయాడు. ముఖ్యంగా స్లాగ్ ఓవర్లలో పేస్ బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు ఇబ్బందిపడ్డాడు. స్పిన్ బౌలింగ్ లోనూ చాలా ఈజీగా బ్యాటింగ్ చేసే మిస్టర్ కూల్ ఈసారి ఎందుకో ఆ జోష్ చూపించలేకపోయాడు. అయితే కీపింగ్ లో మాత్రం మహీ ఇప్పటికీ ది బెస్ట్ అని చెప్పవచ్చు. వికెట్ల వెనుక అత్యంత చురుగ్గా కదులుతాడు . బ్యాట్స్ మెన్ తేరుకునే లోపే స్టంపౌట్ చేయడంలో అతడికి తిరుగులేదు. వరల్ట్ కప్ లోనూ ధోనీ కీపింగ్ అత్యుత్తమంగానే ఉంది. అయితే కేవలం కీపింగ్ స్కిల్స్ తో జట్టులో చోటుని స్థిరపరుచుకునే పరిస్థితి ఇప్పుడు లేదు.పైగా ధోనీకి వయస్సు కూడా 38 సంవత్సరాలు దాటిపోయింది. మరో వరల్డ్ కప్ ఆడే ఛాన్స్ ఎలాగూ లేదు గనుక ఇప్పుటే తప్పుకోవాలన్న డిమాండ్స్ పెరిగిపోయాయి.

త్వరలోనే ధోనీ పొలిటికల్ ఇన్నింగ్స్ మొదలుపెడతాడన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. మహీ బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని అంటున్నారు. అటు కమలనాథులు కూడా ధోనీ లాంటి లెజెండ్ క్రికెటర్ వస్తే పార్టీకి చాలా ఉపయోగపడుతాడని చెబుతున్నారు..ఏకంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story