ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్ ను నియమించిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్ ను నియమించిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్ బీజేపీ సీనియర్ నేత బిశ్వభూషణ్ హరిచందన్ (85) నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒడిశాకు చెందిన హరిచందన్ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడు సార్లు బీజేపీ నుంచి గెలవగా జనతా, జనతాదళ్‌ పార్టీల నుంచి మరో రెండు సార్లు గెలిచారు. ఒడిశా రాష్ట్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. కొంతకాలం ఒడిశా బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. సుదీర్ఘకాలం భారతీయ జనసంఘ్ లో పనిచేసిన హరిచందన్.. 1977 లో బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆయన మంచి రచయిత కూడా.. మంత్రిగా పనిచేసిన సమయంలోనే పలు పుస్తకాలు రచించారు. కాగా విభజన జరిగిన ఐదేళ్ల తరువాత ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్ ను నియమించింది కేంద్రం. మరోవైపు ఛత్తీస్గఢ్ గవర్నర్ గా ‘అనసూయ ఊకే’ నియమితులయ్యారు.

Tags

Next Story