బలవంతంగా కూతుర్ని కాపురానికి పంపారు.. కొన్నాళ్లకు..

బలవంతంగా కూతుర్ని కాపురానికి పంపారు.. కొన్నాళ్లకు..

18 ఏళ్లు నిండాకే అమ్మాయిలకు పెళ్లిల్లు చేయాలని చట్టం ఎంత మొత్తుకుంటున్నా గిరిజన తండాల్లో పట్టించుకునేవారుండరు. హైదరాబాద్‌ శివార్లలోని మామిడిపల్లి తండాలో ఓ బాల్య వివాహం కలకలం రేపింది. పదో తరగతి చదవుతున్న బాలికను మరో తండాకు చెందిన ప్రకాశ్‌తో వివాహం నిశ్చయించారు. ప్రకాశ్‌ అప్పటికే వివాహితుడు. పాప కూడా ఉంది. మొదటి భార్య చనిపోయింది. ప్రకాశ్‌ను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన బాలిక ICDS అధికారులను ఆశ్రయించింది. మైనారిటీ తీరే వరకు అమ్మాయికి పెళ్లి చేయబోమని తల్లిదండ్రుల వద్ద పత్రం రాయించుకున్నారు అధికారులు.

అఫీసర్లు అటు వెళ్లగానే పెళ్లి చేయకుండానే బలవంతంగా కూతుర్ని కాపురానికి పంపారు. కొన్నాళ్లు నరకం అనుభవించిన బాలిక అక్కడి నుంచి పారిపోయింది. బంధువుల ఇంటికి చేరింది. వాళ్లు ఆమె పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దారుణాన్ని గమనించిన అధికారులు బాలికను బాలసదనంలో చేర్పించారు. బాలిక బలహీనంగా ఉండడంతో వైద్య పరీక్షలు చేయించగా ఆమె గర్భవతి అని తేలింది. ఉన్నతాధికారుల అనుమతితో అబార్షన్‌ చేశారు. తల్లిదండ్రులపైనా, పెళ్లి కాకుండానే బలవంతపు కాపురం చేసిన ప్రకాశ్‌పైనా కేసు నమోదు చేశారు.

అధికారులు ఆపుతున్న మైనర్‌ వివాహాల్లో 80శాతం తిరిగి రహస్యంగా జరిపించేస్తున్నారు. ఆపిన పెళ్లిళ్లపై నిఘా లేకపోవడం, మైనర్లను రక్షించే ప్రయత్నాలు చేయకపోవడమే కారణంగా కనిపిస్తోంది. తల్లిదండ్రుల పెరగాల్సిన పిల్లలు.. చిన్న వయసులో తామే తల్లులవుతున్నారు.

Tags

Next Story