వైసీపీ ప్రభుత్వం తీరుతో రాష్ట్ర ప్రజల్లో నిరాశ ఏర్పడింది : బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

వైసీపీ ప్రభుత్వం తీరుతో రాష్ట్ర ప్రజల్లో నిరాశ ఏర్పడింది : బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

వైసీపీ ప్రభుత్వం తీరుతో రాష్ట్ర ప్రజల్లో నిరాశవాద దృక్పదం నెలకొందని అన్నారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. అమరావతి నిర్మాణం తమ తొలి ప్రాధాన్యత కాదని జగన్‌ నిర్ణయం తీసుకోవడంతో నిర్మాణ రంగం కుదేలైందని విమర్శించారు. అభివృద్ధిపై నీలి నీడలు కమ్ముకున్నాయని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ రంగం భారీగా పడిపడిపోవడంతో.. భవన నిర్మాణ కార్మికులకు జీవనోపాధి లభించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చిన ఐటీ కంపెనీలు సైతం పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై దృష్టిపెట్టాలని సూచించారు మాధవ్‌.

Tags

Next Story