వైసీపీ అసమర్ధత చూసే సైట్ నుంచి మెషినరీని తరలించేశారు- చంద్రబాబు
టీడీపీ స్ట్రాటజీ కమిటి సభ్యులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అసెంబ్లీలో టీడీపీపై ఆరోపణలు చేసేందుకే వైసీపీ సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. ప్రజా సమస్యలు పరిష్కరించలేక టీడీపీని టార్గెట్ చేస్తున్నారని అన్నారు. పోలవరం పనులు టీడీపీ 5 ఏళ్లలోనే 66 శాతం పూర్తిచేసిందని కానీ వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. కేంద్రం నుంచి పెండింగ్ నిధులు తేలేక వైసీపీ ఎదురుదాడి అస్త్రాన్ని ఎంచుకుందన్నారు.
వైసీపీ అసమర్ధత చూసే సైట్ నుంచి మెషినరీని అంతా తరలించేశారని, లక్షలాదిమంది కూలీలు ఉపాధి కోల్పోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ హయాంలో 26 ఎంక్వైరీలు వేసినా ఏదీ రుజువు చేయలేక పోయారని ఇప్పుడు మళ్లీ చేస్తున్న విచారణలు కూడా అలాగే ఉంటాయని అన్నారు. మంత్రివర్గ ఉప సంఘాలు, సభా సంఘాలు, జ్యుడీషియరీ కమిటీలు వేసినా ఏమీ తేలలేదని గుర్తు చేశారు. వాళ్లు వేసిన కేసులలో జడ్జిల వ్యాఖ్యలే అందుకు రుజువువన్నారు. రాజకీయ కక్షసాధింపునకు కోర్టులను వేదికగా చేసుకున్నారని అక్షింతలు వేశారని గుర్తు చేసారు. ఇప్పుడు మళ్లీ జగన్మోహన్ రెడ్డి అదే బాటలో నడుస్తున్నారని అన్నారు.
ఎంక్వైరీలతో కాలం గడిపేయాలని జగన్ చూస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. పీపీఏలపై బురద జల్లాలనే ప్రయత్నం ఇప్పటికే అభాసుపాలైందని ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతిని అప్రతిష్ట పాలుచేస్తున్నారని ప్రభుత్వం ఇప్పటికైనా అభివృద్ధి ప్రణాళికపై దృష్టి పెట్టాలని అన్నారు. కియా వైఎస్ తెచ్చారని చెప్పడం వైసీపీ అబద్ధాలకు పరాకాష్టన్నారు.
RELATED STORIES
HCL Recruitment 2022 : ఐటీఐ అర్హతతో హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్లో...
1 July 2022 5:20 AM GMTCoal India Recruitment 2022 : డిగ్రీ అర్హతతో కోల్ ఇండియాలో ఉద్యోగాలు..
30 Jun 2022 5:40 AM GMTICF Railway Recruitment 2022: టెన్త్, ఇంటర్ అర్హతతో ఇంటిగ్రల్ కోచ్...
29 Jun 2022 6:30 AM GMTATC Recruitment 2022: డిగ్రీ అర్హతతో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్...
28 Jun 2022 5:00 AM GMTBIS Recruitment 2022: డిగ్రీ అర్హతతో బ్యూరో ఆఫ్ ఇండియన్...
27 Jun 2022 4:46 AM GMTIndian Air Force Recruitment 2022: ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలు.. ...
25 Jun 2022 4:55 AM GMT