మానసిక సమస్యలను దూరం చేసే 'మాచా' టీ..

కాస్త ఒత్తిడిగా ఫీలైతే ఓ కప్పు కాఫీ సిప్ చేస్తాం. ఒత్తిడి తగ్గడం మాట అటుంచి కాస్త రిలీఫ్‌గా అనిపిస్తుంది. కానీ జపనీయులు తాగే మాచా టీ తాగితే ఒత్తిడి, ఆందోళన, మనసిక సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చని పరిశోధనల్లో వెల్లడైంది. జర్నల్ ఆఫ్ ఫంక్షనల్ ఫుడ్స్ అనే కథనంలో సైంటిస్టులు తెలిపిన వివరాల ప్రకారం.. మాచా పౌడర్‌ని ఆందోళన, కంగారుకు గురవుతున్న ఎలుకలపై ప్రయోగించారు. ఈ పౌడర్ తీసుకున్న ఎలుకలు ఆ పరిస్థితి నుంచి బయటపడినట్లు సైంటిస్టులు గుర్తించారు. మాచాటీలో ఉంటే ఔషధ కారకాలు మన శరీరంలోని డోపమైన్, సెరటోనిన్ అనే హార్మోన్లను యాక్టివేట్ చేస్తాయట. అందుకే మాచా టీ తాగిన వెంటనే మనసు రిలాక్స్‌గా అనిపిస్తుందట. మానసిక సమస్యలతో బాధపడేవారు రోజూ ఓ కప్పు మాచా టీ సిప్ చేస్తే మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com