సర్వే.. టాప్‌ టెన్‌లో తొలి రెండు స్థానాలు తెలుగు రాష్ట్రాలవే

సర్వే.. టాప్‌ టెన్‌లో తొలి రెండు స్థానాలు తెలుగు రాష్ట్రాలవే
X

ఉద్యోగ భద్రత, ఉద్యోగాల కల్పనలో దేశంలోనే తెలుగు రాష్ట్రాలు ఫస్ట్ ప్లేస్ లో నిలిచాయి. ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, తమిళనాడు, కర్ణాటక ఉన్నాయి. బిహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ మాత్రం అట్టడుగున నిలిచాయి. సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ జరిపిన తాజా సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఈ సర్వేలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 57.38 పాయింట్స్ సాధించాయి. పలు అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ రిపోర్ట్ రూపొందించారు. ఉద్యోగాల కల్పన, జీతం, జెండర్ ఈక్వాలిటీ, వంటి అంశాలతోపాటు.. నేషనల్ శాంపిల్ సర్వే, లేబర్ బ్యూరో, ది యానువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రభుత్వ సంస్థలు డేటా కూడా తీసుకొని తాజా ఇండెక్స్ రూపొందించింది సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్.

ఈ సర్వేలో తెలుగు రాష్ట్రాలు టాప్ ప్లేస్ లో ఎలా నిలిచాయన్నది కూడా వివరించింది సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ సంస్థ. ఉద్యోగుల హక్కులు, పెన్షన్, ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్ వంటి సౌకర్యాలు కల్పించడంతోపాటు జెండర్ ఈక్వాలిటీలోనూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు దేశంలో ఉత్తమంగా ఉన్నాయి. ఇక కేరళ, గోవా రాష్ట్రాలు మాత్రం ఉమెన్ ఎంప్లాయి మెంట్ లో చాలా వెనుకబడిపోయాయి. గోవాలో 13.9 శాతం, కేరళలో 11.4 శాతం మంది మహిళలే ఉద్యోగాలు చేస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే టాప్ టెన్ లో మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ చోటు సంపాదించాయి.

క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ జాబ్స్ ఇండెక్స్.. మన దేశంలో 44.58 శాతంగా ఉంది. గ్రామీణ, పట్టన ప్రాంతాల్లో నిరుద్యోగం బాగా పెరిగిపోయింది.. ఇక మహిళలకు ఉద్యోగాలు కల్పించడంలో మన దేశం చాలా వెనుకబడిపోయినట్లు వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్ లో వెల్లడైంది. మొత్తం 131 దేశాల్లో ఇండియాకు 120వ ర్యాంకు లభించింది. అయితే క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ జాబ్స్ ఇండెక్స్ లో దేశం ఓవరాల్ గా 44.58 పాయింట్లు సాధిస్తే.. మన తెలుగు రాష్ట్రాలు మాత్రం అంతకంటే చాలా ముందంజలో ఉండటం విశేషం.

Tags

Next Story