కొత్త గవర్నర్‌కు సీఎం జగన్ ఫోన్

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా తన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తానని అన్నారు బిశ్వభూషణ్ హరిచందన్. పొరుగు రాష్ట్రాలతో ఉన్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. రాజ్యాంగపదవిలో ఉన్న తాను రాజకీయాలకు అతీతంగా రాజ్ భవన్ ప్రతిష్ట పెంచేలా వ్యవహరిస్తానని బిశ్వభూషన్ హరించదన్ అన్నారు.
ఏపీ కొత్త గవర్నర్ గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్‌కు అధికార, ప్రతిపక్ష నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం జగన్ ఫోన్ ద్వారా గవర్నర్ కంగ్రాట్స్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా సీఎం నూతన గవర్నర్‌ను కోరారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. విశిష్ట నాయకుడిగా కొత్త బాధ్యతను ఆయన సమర్థంగా నిర్వర్తిస్తారని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్ చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా కొత్త గవర్నర్‌కు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ సంక్షేమానికి కొత్త గవర్నర్ కు అన్ని విధాల దోహదం చేస్తామని అన్నారు లోకేష్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com