జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టిన మందకృష్ణ మాదిగ

జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టిన మందకృష్ణ మాదిగ

ఎస్సీ వర్గీకరణ చేయటం అంటే దళితుల్లో చీలిక తేవటమే అన్న సీఎం జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు మందకృష్ణ మాదిగ. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. తండ్రి ఆశయాల దిశగా జగన్ అడుగులు వేయాలన్నారు ఆయన. ఎస్సీ వర్గీకరణపై ఏ అసెంబ్లీలో స్టేట్ మెంట్ ఇచ్చారో అదే అసెంబ్లీ వేదికగా 24 గంటల్లో స్పష్టమైన వైఖరి తెలియజేయాలని డిమాండ్ చేశారు. లేదంటే 48 గంటల్లో మా భవిష్యత్ కార్యచరణ ఉంటుందని హెచ్చరించారు మందకృష్ణ మాదిగ.

Tags

Next Story