కేటీఆర్‌ సర్.. నేను విన్నది నిజమేనా

కేటీఆర్‌ సర్.. నేను విన్నది నిజమేనా

కేటీఆర్‌ .. ప్రముఖ దర్శకుడు మారుతి మధ్య ట్విటర్‌లో ఆసక్తికరమైన చర్చ జరిగింది. "హైదరాబాద్‌కు 48 రోజులకు సరిపోయే మంచి నీరు మాత్రమే మిగిలి ఉంది’ అని ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికలో వార్త ప్రచురితమైంది. ఆ వార్తను మారుతి కేటీఆర్‌ ట్విటర్ ఖాతకు ట్యాగ్‌ చేశారు . ‘సర్‌ ఇది నిజమేనా’ అంటూ ప్రశ్నించారు. మారుతి కామెంట్‌పై

స్పందించిన కేటీఆర్‌ "ఆ వార్త అవాస్తవం. కాళేశ్వరం నీరు మరికొద్ది రోజుల్లో ఎల్లంపల్లి రిజర్వాయర్‌లోకి వస్తుంది. అక్కడి నుంచి హైదరాబాద్‌ నగరానికి రోజూ 172 మిలియన్‌ గ్యాలన్ల నీరు అందుతూనే ఉంటుంది. చెన్నై నగరంలా హైదరాబాద్‌లో ఎప్పుడూ నీటి ఎద్దడి ఉండదు. నీటి పొదుపుకు సంబంధించిన ప్రాధాన్యతను కూడా నగరవాసులు గుర్తించారని సమాధానమిచ్చారు" కేటీఆర్. ఈ రిట్వీట్‌పై స్పందించిన మారుతి ‘శుభవార్త చెప్పినందుకు ధన్యవాదాలు సర్‌. నీటి కొరత సమస్యను తగ్గించుకునేందుకు జల సంరక్షణ చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది’ అని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story