నానమ్మ దగ్గరికి తీసుకెళ్తానని స్కూటీ ఎక్కించుకున్నాడు.. ఆపై..

నానమ్మ దగ్గరికి తీసుకెళ్తానని స్కూటీ ఎక్కించుకున్నాడు.. ఆపై..

బాలికను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని చితకబాదారు జనాలు. మునీర్ అనే వ్యక్తి ఓ బాలికకు మాయమాటలు చెప్పి బైక్ పై ఎక్కించుకున్నాడు. చిల్కూరు వైపు తీసుకెళ్తుండటంతో ఆ బాలిక అనుమానంతో కేకలు వేసింది. అమ్మాయి అరుపులు విన్న ఓ వ్యక్తి మునీర్ స్కూటీ ఆపి విషయం తెల్సుకున్నాడు. మిగిలిన వాహనదారులతో కలిసి మునీర్ చితకబాది పోలీసులకు అప్పగించాడు.

కార్వాన్ దగ్గర ఒంటరిగా ఉన్న బాలికను గమనించిన మునీర్ ఆమెతో మాట కలిపాడు. మీ నానమ్మ దగ్గరికి తీసుకెళ్తానని నమ్మించి స్కూటీ ఎక్కించుకున్నాడు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు వరకు తీసుకెళ్లాడు. తనను ఎక్కడికో తీసుకెళ్తున్నాడని గ్రహించిన ఆ బాలిక కేకలు వేయటంతో మునీర్ కిడ్నాప్ బండారం బయటపడింది. మునీర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మైనర్ బాలిక వివరాలు తెల్సుకొని కుటుంబసభ్యులకు అప్పగిస్తామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story