రైల్వేలో క్లరికల్ గ్రేడ్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఆఖరి తేదీ..

752 పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నోటిఫికేషన్ జారీ చేసింది. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, స్టేషన్ మాస్టర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది పశ్చిమ రైల్వే. అయితే ఇప్పటికే రైల్వేల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు జులై 30 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు www.rrc-wr.com వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

మొత్తం పోస్టులు: 752.. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 105.. ట్రైన్స్ క్లర్క్: 18.. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 238.. గూడ్స్ గార్డ్: 100 సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 129.. స్టేషన్ మాస్టర్: 135.. వయసు: జనరల్ అభ్యర్థులకు 21-42 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 21-45 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 21-47 ఏళ్లు.

దరఖాస్తు ప్రారంభం: 2019 జులై 1.. దరఖాస్తు ముగింపు: 2019 జులై 30

Tags

Read MoreRead Less
Next Story