జూనియర్‌ స్టూడెంట్‌ను చితకబాదిన ఐదుగురు సీనియర్లు

జూనియర్‌ స్టూడెంట్‌ను చితకబాదిన ఐదుగురు సీనియర్లు

యాదాద్రి భువనగిరి జిల్లాలో మరోసారి ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. భువనగిరిలోని కేబీఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో జూనియర్‌ను సీనియర్లు తీవ్రంగా వేధించారు. అంతటితో ఆగకుండా చితకబాదారు. ఈ బాధ తట్టుకోలేక ఆ విద్యార్థి కంప్లైంట్ చేయడంతో.. కాలేజీ యాజమాన్యం ఐదుగురిని సస్పెండ్ చేసింది. ఇదే కాలేజీలో ఏడాది వ్యవధిలో ఇది నాలుగో ఘటన. ఇంత జరుగుతున్నా మేనేజ్‌మెంట్ ర్యాగింగ్ నివారణకు సరైన చర్యలు తీసుకోకపోవడంపై పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టూడెంట్స్‌లో మార్పు కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు, కౌన్సెలింగ్ తరహా చర్యలు లేకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story